కారు డోర్ లాక్: ఇద్దరు చిన్నారుల మృతి
గుర్గావ్ : ఆటపాటలు తప్ప ఇతర ప్రపంచమే తెలియని ఆ చిన్నారులను అవే తమ ప్రాణాలను తీస్తాయని ఊహించలేదు. కారు రూపంలో మృత్యువు వారి ముంగిట నిలిచింది. ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్లు, రెండేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు ఆటలో భాగంగా కారులోకి ఎక్కారు. అనుకోకుండా తమకు తెలియకుండానే డోర్ లాక్ చేసుకున్నారు. అలా ఎక్కువ సమయం కారులో ఉండటంతో ఊపిరాడక దయనీయ స్థితిలో చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయితే ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా గుర్తించినట్లు తెలుస్తోంది.
స్థానికులు గమనించేసరికే ఆ పసిపాపలు మృతదేహాలుగా మారిపోయాయని పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు చిన్నారులు బాలికలు ఐదేళ్ల లపు వారే కావడం గమనార్హం. ఆ చిన్నారులు ఒకే కుటుంబానికి చెందినవారా? కాదా.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.