విద్యార్థుల కోసం జాతీయ డిజిటల్ లైబ్రరీ | UGC to set up national digital library | Sakshi
Sakshi News home page

విద్యార్థుల కోసం జాతీయ డిజిటల్ లైబ్రరీ

Published Mon, Aug 22 2016 1:44 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

UGC to set up national digital library

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్ధల్లోని డిజిటల్ పాఠ్యాంశాలు అనుసంధానించి సింగిల్ విండో ద్వారా విద్యార్థులకు అందించే లక్ష్యంతో జాతీయ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసేందుకు యూజీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. జాతీయ డిజిటల్ లైబ్రరీని సమన్వయం చేసే బాధ్యతను ఐఐటీ ఖరగ్‌పూర్‌కు అప్పగించింది.

ప్రాథమిక స్దాయి నుంచి పీజీ వరకూ అన్ని కోర్సుల్ని జాతీయ డిజిటల్ లైబ్రరీలో పొందుపరుస్తారు. లక్షకుపైగా వ్యాసాలు, 70కి పైగా భాషల్లోని పాఠ్యాంశాలు అందుబాటులో ఉంటాయి. లైబ్రరీలో నమోదు చేసుకోవాలని విద్యార్ధులకు సూచించాలని అన్ని వర్సిటీల వీసీలను కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement