సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన మోదీ ఆయనకు రాజీనామా లేఖ అందచేశారు. మోదీ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ పదవిలో కొనసాగాలని కోరారు. కాగా, అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో 16వ లోక్‌సభ రద్దుకు తీర్మానం ఆమోదించారు. మంత్రి మండలి తీర్మానం నేపథ్యంలో ప్రధాని మోదీ తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా రాష్ట్రపతికి రాజీనామా లేఖను సమర్పించారు.
కాగా నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రస్తుత ప్రభుత్వానికి ఇది తుది కేబినెట్ సమావేశం కావడం గమనార్హం. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తదుపరి ప్రభుత్వంలో తొలి వంద రోజుల్లో చేపట్టబోయే కార్యాచరణపైనా చర్చ జరిగినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment