గౌహతి : అరుణాచల్ప్రదేశ్లో రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధమైంది. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కేంద్రమంత్రి వర్గం రాష్ట్రపతికి సిఫార్సు చేసిందని సమాచారం. ఆదివారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో ఆయన అధ్యక్షత కేంద్రమంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా అరుణచల్ప్రదేశ్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితపై చర్చకు వచ్చింది. అరుణాచల్ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే కంటే.... దానిని సుప్తచేతనావస్థలో ఉంచి... రాష్ట్రపతి పాలన వైపే కేంద్రమంత్రి వర్గం మొగ్గుచూపినట్లు తెలిసింది.
గతేడాది డిసెంబర్ 16, 17 తేదీల్లో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు హోటల్లో జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 60 మంది ఎమ్మెల్యేలు గల ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 47 సీట్లు ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి నబమ్ తుకికి కేవలం 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతు ఇస్తున్న విషయం విదితమే. అయితే అరుణాచల్ప్రదేశ్ గవర్నర్ రాజ్కోవా బీజేపీ ఏజెంట్గా వ్యవహారిస్తున్నారంటూ ముఖ్యమంత్రి నబమ్ తుకి ఆరోపించారు.
అరుణాచల్ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన !
Published Sun, Jan 24 2016 1:30 PM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM
Advertisement