భారత్‌లో మధ్యతరగతి పురోభివృద్ధి ఎంతో | United Nations reports on exploding middle class in india | Sakshi
Sakshi News home page

భారత్‌లో మధ్యతరగతి పురోభివృద్ధి ఎంతో

Published Wed, Nov 9 2016 4:38 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM

United Nations reports on exploding middle class in india

న్యూఢిల్లీ : భారత్‌లో మధ్య తరగతి జనాభాపరంగానే కాకుండా ఆర్థికపరంగా కూడా ఎంతో పురోభివృద్ధి సాధిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో 120 కోట్ల మంది జనాభాతో రెండో స్థానంలో వున్న భారత్‌ 2022 నాటికి చైనాను అధిగమించి మొదటి స్థానాన్ని చేరుకుంటుంది. అలాగే 2027 నాటికి మధ్య తరగతి జనాభా కూడా ప్రపంచ రికార్డును సాధిస్తుందని ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో వెల్లడించింది.

2004 నాటి గణాంకాల ప్రకారం భారత్‌లో మధ్య తరగతి ప్రజల సంఖ్య 30 కోట్లు ఉండగా, అది కేవలం ఎనిమిది ఏళ్లలోనే, అంటే 2012 నాటికి 60 కోట్లకు చేరుకుందని, మొత్తం దేశ జనాభాలోనే సగానికి చేరకుందని ఆ నివేదిక తెలియజేసింది. మధ్యతరగతి ఆదాయం 1990 దశకంలో 25లక్షల డాలర్లు ఉండగా అది 2015 సంవత్సరం నాటికి ఐదు కోట్ల డాలర్లకు  చేరుకుందని యూరోమానిటర్‌ ఇంటర్నేషనల్‌ తెలియజేసింది. అలాగే వారి రోజువారి తలసరి సగటు ఖర్చు రెండు డాలర్ల నుంచి 10 డాలర్ల మధ్యనుందని నివేదిక తెలిపింది. వారి దిగువ మధ్య తరగతి తలసరి రోజువారి ఖర్చు 4 నుంచి 6 డాలర్ల వరకు ఉందని పేర్కొంది.
 
2027 నాటికి భారత్‌లోని మధ్య తరగతి జనాభా అమెరికా, యూరప్, చైనాలను అధిగమించి ప్రపంచ రికార్డును సాధిస్తుంది. 2005 నాటి నుంచి గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే 2014 వరకు మధ్య తరగతి ఇంటి పొదుపు మొత్తాలు మూడింతలు పెరిగాయి. అంటే నాడు ఆరువేల డాలర్లు ఉండగా, అవి నేడు 24వేల డాలర్లకు చేరుకున్నాయి. మధ్యతరగతిలోకి మరిన్ని వృత్తులు, వ్యాపారులు చేరడంతో ఈ తరగతి గణనీయంగా పెరుగుతోంది. వెండర్లు, ఫుడ్‌ ఇండస్ట్రీ, లెదర్‌ వర్క్, పెయింటర్లు, కార్పెంటర్లు, కన్‌స్ట్రక్షన్, క్లాత్‌షాప్, వాషింగ్, సెక్యురిటీ సర్వీసెస్, వెల్డింగ్, రిపేరింగ్, కేబుల్, ఎలక్ట్రికల్‌ వర్క్స్, డ్రైవర్, ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్, డాటా ఎంట్రీ, జరీ మేకర్స్, బ్యాంగిల్‌ మేకర్స్‌ మధ్య తరగతి పరిధిలోకి వచ్చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement