యూపీ గవర్నర్‌ సంచలన నిర్ణయం | up governor sensation decision on ex minister | Sakshi
Sakshi News home page

యూపీ గవర్నర్‌ సంచలన నిర్ణయం

Published Thu, May 4 2017 5:28 PM | Last Updated on Tue, Sep 5 2017 10:24 AM

యూపీ గవర్నర్‌ సంచలన నిర్ణయం

యూపీ గవర్నర్‌ సంచలన నిర్ణయం

► యూపీ సీఎం యోగికి గవర్నర్‌ లేఖ

లఖ్‌నవూ(ఉత్తరప్రదేశ్‌): యూపీ గవర్నర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి మహమ్మద్‌ ఆజం ఖాన్‌పై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్‌ రామ్‌ నాయక్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాయటం సంచలనం రేపుతోంది. ఆజంఖాన్‌ అధికార దుర్వినియోగంపై రాసిన లేఖలో ఆయన 14 అంశాలను ప్రస్తావించారు. అఖిలేష్‌యాదవ్‌ సీఎంగా ఉన్న సమయంలో మంత్రిగా పనిచేసిన ఆజంఖాన్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపారు.

వక్ఫ్‌బోర్డు ఆస్తులను ఆక్రమించుకున్నారని, ప్రజాధనంతో ప్రైవేటు వర్సిటీలో అతిథిగృహాన్ని నిర్మించుకున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా, స్పోర్ట్స్‌ స్టేడియంనకు సంబంధించిన సామగ్రిని రాంపూర్‌లోని ప్రైవేట్‌ వర్సిటీ మహ్మద్‌ అలీ జౌహార్‌ వర్సిటీకి అక్రమంగా తరలించారని వివరించారు. అంతేకాకుండా వక్ఫ్‌బోర్డు ఆస్తుల ఆక్రమణకు సంబంధించి అధికారులు అందజేసిన 42 పేజీల నివేదికను కూడా జతపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement