హరిద్వార్ : మద్యం సేవిస్తూ గన్స్‌ను చేతబట్టి డ్యాన్స్‌లు చేస్తూ కెమెరాకు చిక్కిన ఉత్తరాఖండ్ ఎమ్మెల్యే కన్వర్ ప్రణవ్ సింగ్ ఛాంపియన్‌ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించినట్టు బీజేపీ బుధవారం వెల్లడించింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో కున్వర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు మూడు పిస్టల్స్, రైఫిల్స్ చూపుతూ డ్యాన్స్ చేయడం దుమారం రేపింది.
తాను చేస్తున్న ఈ ఫీట్‌ను దేశంలో ఏ ఒక్కరూ చేయలేరని బీజేపీ ఎమ్మెల్యే ఈ వీడియోలో అనుచరులతో చెప్పడం వినిపించింది. ఎమ్మెల్యే చర్యపై పార్టీ వివరణ కోరగా ఆయన ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో చర్య తీసుకున్నామని బీజేపీ జాతీయ మీడియా ఇన్‌చార్జి అనిల్ బలూనీ తెలిపారు. అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించాలని బీజేపీ క్రమశిక్షణా కమిటీ నిర్ణయించిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment