ఎడతెరిపిలేకుండా అకాల వర్షం కురిసిన కారణంగా తమిళనాడులోని ఉదకమండలంలోగల కొన్ని ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. దాదాపు 200కు పైగా నివాసాల్లోకి వర్షపునీరు ప్రవేశించి దెబ్బతినగా 50కిపైగా వాహనాలు కొట్టుకుపోయాయి. దాదాపు 36గంటలపాటు కురిసిన ఈ వర్షం ఆదివారం ఉదయం 8.30కు కాస్త తెరపునిచ్చిందని అక్కడి అధికారులు తెలిపారు. అనుకోకుండా భారీ వర్షం రావడంతో ఏం చేయాలో అర్ధం కాలేదని, అక్కడే ఉన్న కూనూరు నది పొంగి నీరు ఇళ్లలోకి, వీధుల్లోకి చేరిందని తెలిపారు. వాననీటికి కొట్టుకుపోయి ధ్వంసమైన వాహనాల్లో 25 టూ వీలర్స్, పది ఆటో రిక్షాలు, పది కార్లు, ఇతర వాహనాలు ఉన్నాయి.