భర్తను పొడిచి చంపేసిన మహిళా డెంటిస్ట్ | Woman dentist stabs husband to death | Sakshi
Sakshi News home page

భర్తను పొడిచి చంపేసిన మహిళా డెంటిస్ట్

Published Mon, Nov 30 2015 3:29 PM | Last Updated on Sun, Sep 3 2017 1:16 PM

భర్తను పొడిచి చంపేసిన మహిళా డెంటిస్ట్

భర్తను పొడిచి చంపేసిన మహిళా డెంటిస్ట్

నాగపూర్: ఓ దంత వైద్యురాలు భర్తతో గొడవపడి కత్తితో పొడిచి చంపేసింది. నాగపూర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ట్వింకిల్ రవికాత్ (40) దంత వైద్యురాలుగా, ఆమె భర్త రవికాంత్ మధుకర్ (42) పాథాలజీ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. ఆదివారం వీరిద్దరూ ఓ విషయంపై గొడవపడ్డారు. విచక్షణ కోల్పోయిన ట్వింకిల్ కత్తి తీసుకుని భర్త కడుపులోకి పొడిచింది. తీవ్రంగా గాయపడిన మధుకర్ ను చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు మహిళా డెంటిస్ట్పై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కొంతకాలంగా వీరిద్దరూ తరచూ గొడవపడుతుండేవారని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement