ఛత్తీస్గఢ్లో మహిళపై దారుణం
దాదాపు 15 గంటలపాటు బాధితురాలు అటవీ ప్రాంతంలోనే ఉంది. స్పృహలోకి వచ్చాక నెమ్మదిగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి నడుచుకుంటూ వచ్చింది. జరిగిన దురాగతాన్ని తల్లిదండ్రులకు చెప్పటంతో వారు ఆమెను తీసుకుని ఠాణాకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు.. నితేష్(22), లియాండర్ బెక్(25), రోస్టిన్(22), సచిన్(19), సంగీత్(26), అసిత్ బెక్(29), అమిత్ బెక్(25), అమ్రిత్ కుజూర్(23) అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో 8వ తరగతి చదువుకుంటున్న ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుని జువెనైల్ హోంకు తరలించారు. మిగతా 8 మందిని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.