బియాస్: ప్రపంచంలోనే అతిపెద్ద రూఫ్ టాప్ సొలార్ ప్లాంట్ పంజాబ్ లో ఏర్పాటైంది. 11.5 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ ను పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ మంగళవారం ప్రారంభించారు. అమృతసర్ కు 45 కిలోమీటర్ల దూరంలో రూ. 139 కోట్ల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేశారు. 82 ఎకరాల విస్తీర్ణంలో రాధా సౌమీ సత్సంగ్ బియాస్(ఆర్ఎస్ఎస్ బీ) దీన్ని నిర్మించింది. పర్యావరణ హిత విధానాలతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేశారు.
అతిపెద్ద రూఫ్ టాప్ సొలార్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ఆర్ఎస్ఎస్ బీను సీఎం బాదల్ అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా సొలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటును తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పునర్వినియోగ ఇంధన వనరుల శాఖ మంత్రి బిక్రం సింగ్ తెలిపారు. ఇందుకోసం పలు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టు వెల్లడించారు.
అతిపెద్ద రూఫ్ టాప్ సొలార్ ప్లాంట్
Published Tue, May 17 2016 7:22 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM
Advertisement