మదర్సాలకు నిధుల నిలిపివేత
సాక్షి, లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లోని 46 ఎయిడెడ్ మదర్సాలకు నిధులు నిలిపి వేస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మదర్సాలు నిర్వహణలో ఆక్రమాలు చోటు చేసుకోవడం వల్లే ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు గత రెండు నెలలుగా యూపీలోని మొత్తం 560 మదర్సాలను తనిఖీలు చేశారు. అందులో 46 మదర్సాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.
కాగా మదర్సాలకు నిధులు నిలిపివేయడంపై ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రి యోగీ ఆదినాత్యనాథ్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ ఇతర మతాలను గౌరవించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు.