ఎమ్మెల్యే సీటు కింద బాంబు కలకలం..
లక్నో:
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యే సీటు కింద బాంబు లభించడం కలకలం సృష్టిస్తోంది. అనుమానాస్పదంగా ఎమ్మెల్యే సీటు కింద 60 గ్రాముల పౌడర్ను అసెంబ్లీ సిబ్బంది బుధవారం గుర్తించింది. దీన్ని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపగా పెంటాఎరిత్రిటాల్ టెట్రానైట్రేట్ (పీఈటీఎన్) అనే శక్తివంతమైన ప్లాస్టిక్ పేలుడుపదార్థంగా గుర్తించారు. దీంతో అసెంబ్లీలోనే ఈ పేలుడు పదార్థం లభించడంతో ఎమ్మెల్యేలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఈ సంఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ హుటాహుటిన ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే దీనిపై భద్రతాధికారులు విచారణ ప్రారంభించినట్టు చెబుతున్నారు. అసెంబ్లీలోనే భద్రత ఇంత దారుణంగా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ ప్రతపక్షాలు ధ్వజమెత్తాయి.