కౌలాలంపూర్ : పిరమిడ్ సొసైటీ అఫ్ మలేషియా, జెన్ పైడా ఇంటర్నేషనల్, మలేషియా తెలుగు ఫౌండేషన్, మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్, తెలుగు ఇంటెలెక్చువల్ సొసైటీ అఫ్ మలేషియా సంయుక్తంగా నిర్వహించిన శత నృత్య మహా యాగం బ్రిక్స్‌ఫీల్డ్స్‌లోని టెంపుల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో జరిగింది.
భారతదేశం నుండి 100 మందికి పైగా వచ్చిన కళాకారుల బృందం పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రేక్షకులని అలరించారు. ఇందులో భాగంగా బతుకమ్మ, దసరా సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలుగు ఎమ్మెల్యే శివనేశ్వరన్, వైబీ గణపతి రావు, కాంతారావు, సైదం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment