కౌలాలంపూర్: టీఆర్‌ఎస్ మలేషియా ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు నిర్వహించారు. కోవిడ్ -19 కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను తెరాస మలేషియా కమిటీ సభ్యులు, మలేషియా లో ఉంటున్న ప్రవాస తెలంగాణ ప్రజలు ఆన్‌లైన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్‌ఎస్ ఎన్నారై సమన్వయకర్త మహేష్ బిగాల, గౌరవ అతిథిగా తెలంగాణ జానపద గాయని రేలారే గంగ తర సభ్యులతో కలిసి కాన్ఫరెన్స్ కాల్లో రాష్ట్ర అవతరణ వేడుకలలో పాల్గొన్నారు. ముందుగా అధ్యక్షులు చిట్టిబాబు తెలంగాణ తల్లి పటానికి పుష్పాలంకరణ చేసి జ్యోతి ప్రజ్వళనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా సభ్యులందరు అమరవీరుల త్యాగాన్ని గుర్తుచేసుకొని వారికి నివాళులర్పించి 2 నిముషాలు మౌనం పాటించారు. ముఖ్య అతిథి మహేష్ బిగాల మాట్లాడుతూ సభ్యులకు మరియు యావత్ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభకాంక్షాలు తెలియజేసారు. లాక్‌డౌన్‌సమయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకుంటున్న ప్రణాళికలు, కార్యక్రమాలను గురించి వివరించారు. టీఆర్‌ఎస్ మలేషియా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా ప్రతీవిషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. సభ్యులకు, ప్రవాస తెలంగాణ వాసులకు అధ్యక్షులు చిట్టిబాబు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభకాంక్షలు తెలియజేసారు. ఇతర దేశాల నుంచి తిరిగి రాష్ట్రానికి చేరుకుంటున్న వారిని ప్రభుత్వం ఆదరిస్తున్న తీరును, కల్పిస్తున్న సదుపాయాలను ప్రశంసించారు. దుబాయ్ నుంచి వచ్చిన 25 మంది బాధితులకు వారి ఆర్ధిక స్థితిని తెలుసుకొని తన సొంత ఖర్చులతో వారికి క్వారంటైన్ శిభిరంలో చేర్చిన మహేష్ బిగాలను అభినందించారు.
రేలారే గంగ మాట్లాడుతూ ఒక కొత్త తీరుగా రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమంలో తనని బాగస్వామ్యురాలిని చేసినందుకు ఉపాధ్యక్షులు మారుతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యమ సమయంలో పాడిన పాటలను పాడుతూ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమాన్ని నిర్వహించిన కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు లాక్ డౌన్ సమయంలో రాష్ట్రంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమ వివరాలను, మలేషియాలో చిక్కుకున్న బాధితుల వివరాలను, వారికి అందించిన సహాయాన్ని గురించి మహేష్ బిగాలకి వివరించారు. కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు రమేష్, మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, హరీష్ గుడిపాటి, శ్రీనివాస్ ముల్కల, సాయి హేమంత్, రవిందర్ రెడ్డిలు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ మలేషియా ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
Published Wed, Jun 3 2020 2:24 PM | Last Updated on Wed, Jun 3 2020 2:39 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment