రాజకీయ వ్యూహశిల్పి భాట్టం | Architect of political strategy of BHATTAM SRIRAMA MURTY | Sakshi
Sakshi News home page

రాజకీయ వ్యూహశిల్పి భాట్టం

Published Tue, Jul 7 2015 12:36 AM | Last Updated on Sun, Sep 3 2017 5:01 AM

రాజకీయ వ్యూహశిల్పి భాట్టం

రాజకీయ వ్యూహశిల్పి భాట్టం

అంగబలం, అర్థబలం లేకున్నా, కేవలం తన మేథాశక్తితో, రాజకీయ వ్యూహ చతురతతో, రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన అరుదైన రాజకీయవేత్త భాట్టం శ్రీరామమూర్తి. విజయనగర సంస్థానాధీశుడు పి.వి.జి.రాజు అనుచరునిగా, ఆంతరంగిక కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన పి.వి.జి.రాజుతో వచ్చిన విభేదాల కారణంగా తన రాజకీయ కార్యక్షేత్రాన్ని రాష్ట్ర రాజధాని హైదరా బాద్‌కు మార్చుకున్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడిగా రాష్ట్ర కాంగ్రెస్‌లో పట్టు సాధించారు. విజయనగరం శాసనసభ్యునిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి 1967 ఎన్నికల్లో జనసంఘ్ నేత ఒబ్బిలిశెట్టి రామారావు చేతిలో ఓటమి పాలయ్యారు.
 
 తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 1972 శాసన సభ ఎన్నికల్లో విశాఖ జిల్లా పరవాడ నియోజకవర్గం నుంచి ఎన్నికైనారు. పి.వి. నరసింహారావు, జలగం వెంగళరావు మంత్రివర్గాలలో 1972 నుంచి 1978 వరకు విద్య, సాంస్కృ తిక, సాంఘిక సంక్షేమ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. 1969, 1972లలో తలెత్తిన జై తెలం గాణ, జై ఆంధ్ర ఉద్యమాలలో సమై క్యవాదానికే కట్టుబడి ఉన్నారు. ముఖ్యంగా 1972 జై ఆంధ్ర ఉద్య మం సందర్భంగా ఎన్ని అవమా నాలు ఎదురైనా, అభిమానులు, అనుచరుల నుంచి ఎన్ని ఒత్తిడిలు వచ్చినా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయా లకు, రాష్ట్ర ముఖ్యమంత్రుల అభీష్టానికి వ్యతిరేకం గా వ్యవహరించని విధేయుడు. 1978లో కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చినప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. 1978 ఎన్నికల్లో తిరిగి రెండోసారి పరవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ఎన్నికయ్యారు.
 
 1978 నుంచి 1980 జూన్ వర కు రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ (అర్స్) పక్షాన  ప్రతిపక్షనేతగా సమ ర్థ వంతమైన పాత్ర నిర్వహించారు. 1980లో లోక్‌సభ మధ్యంతర ఎన్ని కలలో విశాఖ లోక్‌సభ నుంచి కాం గ్రెస్ (అర్స్) పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తరువాత కాం గ్రెస్(ఐ)లో చేరిపోయారు. 1980 అక్టోబర్‌లో రాష్ట్ర పగ్గాలు చేపట్టిన ఒకనాటి తన మంత్రివర్గ సహచరుడు టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో మంత్రి పదవి చేపట్టారు. తర్వాత భవనం వెంకటరాం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వాలలోనూ మంత్రిగా కొనసాగారు. 1981లో మలేషియాలో జరిగిన రెండవ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో, నాటి సాంస్కృతిక వ్యవ హారాల శాఖామంత్రిగా ప్రశంసనీయమైన పాత్ర నిర్వహించారు.
 
 1984లో తెలుగుదేశం పార్టీలో జరిగిన నాదెం డ్ల ఉదంతంలో కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఈ క్రమంలో టీడీపీ నాయకత్వానికి దగ్గరై 1984 డిసెంబర్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరు సంజీవరావుపై గెలుపొందారు. 1989 లో జరిగిన జమిలి ఎన్నికల్లో విశాఖ-1 శాసనసభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఈటి విజయలక్ష్మి చేతిలో అనూహ్య ఓటమితో క్రియాశీల రాజకీయాలకు స్వస్తి పలికారు.
 
కాలానుగుణంగా వచ్చే రాజకీయ మార్పులను దూరదృష్టితో అంచనా వేసి తన శేష జీవితాన్ని సత్య సాయిబాబా సేవలో గడిపారు. మంచివక్త అయిన భాట్టం, బహిరంగ సభల్లో కానీ, అంతర్గత సమా వేశాల్లో కానీ ప్రసంగించే తీరు అద్భుతం. ప్రజా ప్రతినిధిగా, రాజకీయనేతగా, వ్యూహకర్తగా, వక్తగా రాణించి వేలాదిమందిని అభిమానులుగా, విధేయు లుగా మలుచుకున్న సుదీర్ఘ రాజకీయ బాటసారి భాట్టం ప్రస్థానం 06-07-2015న ముగిసింది. చివ రిదశలోనూ సత్యసాయి సేవాసమితి కార్యక్రమాల్లో పాల్గొన్న ధన్యజీవి.
 (వ్యాసకర్త ఫ్రీలాన్స్ జర్నలిస్టు, 9347039294)
 - బి.వి.అప్పారావు

Advertisement
Advertisement