కవిత
కంటికి కనిపించని రంగుల్ని కూడా
చూడగలిగిన చిత్రాకారుడెవరైనా
ఈ క్షణం నిన్నూ- నువ్వున్న స్థలాన్నీ
యథాతథంగా చిత్రిస్తే
అదెంత ముచ్చటగా ఉంటుందో తెలుసా..?
ఆ బొమ్మలో
నువ్వు నిల్చునో లేదా కూర్చునో
పడుకునో లేదా పరుగెత్తుతూనో
నడుస్తూనో లేదా ఆగి
నడిచొచ్చిన దారివైపు దిగులుగానో
నడవాల్సిన దూరంవైపు ఆశగానో
చూస్తూ ఉంటావ్.
నీ చుట్టూ ఉన్న పరిసరాల్లో దాక్కొని
జీవితమూ-మృత్యువూ
నీవైపే ఆసక్తిగా చూస్తూ ఉంటాయి.
పై విషయాన్ని ధ్రువీకరిస్తూ మాత్రమే
నీకన్నా ముందు వెళ్లిపోయినవాడి సంతకం
కనిపించని రంగుల్లో
చిత్రంలో మరోవైపు ఉంటుంది.
భగవంతం
9399328997
చిత్రలోక సంచారి
Published Sun, Aug 30 2015 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 8:21 AM
Advertisement
Advertisement