గ్రహం అనుగ్రహం, బుధవారం, డిసెంబర్ 10, 2014 | graham anugraham | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, బుధవారం, డిసెంబర్ 10, 2014

Published Wed, Dec 10 2014 1:56 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM

graham anugraham

శ్రీ జయనామ సంవత్సరం,దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం
తిథి బ.చవితి రా.8.15 వరకు,  నక్షత్రం పుష్యమి తె.5.15 వరకు (తెల్లవారితే గురువారం)
వర్జ్యం ప.11.51 నుంచి 1.35 వరకు
దుర్ముహూర్తం ప.11.51 నుంచి 12.28 వరకు
అమృతఘడియలు రా.10.16 నుంచి 12.00 వరకు
సూర్యోదయం:6.23 , సూర్యాస్తమయం: 5.22
రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు

---------

ఈరోజు రాశిఫలాలు

మేషం: పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి,వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
వృషభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందువినోదాలు. విద్య, ఉద్యోగావకాశాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మిథునం: మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. దూరప్రయాణాలు.
కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఇంటిలో  శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
సింహం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ధనవ్యయం.
కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. వ్యాపార,ఉద్యోగాలలో అనుకూలత.
తుల: నూతన ఉద్యోగయోగం. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
వృశ్చికం: బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆస్తి వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. నిరుద్యోగులకు నిరుత్సాహం.
ధనుస్సు: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. మిత్రులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
మకరం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కుంభం: పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
మీనం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
 - సింహంభట్ల సుబ్బారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement