Jayanama year
-
గ్రహం అనుగ్రహం,మంగళవారం 30, డిసెంబర్ 2014
శ్రీజయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి శు.నవమి ప.1.00 వరకు తదుపరి దశమి నక్షత్రం రేవతి ఉ.9.21 వరకు తదుపరి అశ్వని, వర్జ్యం ..లేదు. దుర్ముహూర్తం ఉ.8.50 నుంచి 9.38 వరకు తదుపరి రా.10.53 నుంచి 11.41 వరకు అమృతఘడియలు ఉ.7.04 నుంచి 8.40 వరకు సూర్యోదయం:6.33 సూర్యాస్తమయం:5.21 రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు భవిష్యం మేషం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక లాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి సహాయం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. దైవదర్శనాలు. వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి. మిథునం: ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వస్తు, వస్త్రలాభాలు. భూవివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. సింహం: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. బంధువులతో వివాదాలు. వృత్తి,వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు. కన్య: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఒప్పందాలు వాయిదా. శ్రమ తప్పదు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. వృశ్చికం: కొన్ని పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ధనుస్సు: బంధువులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. మకరం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. కుంభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మీనం: బంధువులతో మాటపట్టింపులు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం,సోమవారం 29, డిసెంబర్ 2014
శ్రీజయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి శు.అష్టమి ప.3.02 వరకు తదుపరి నవమి, నక్షత్రం ఉత్తరాభాద్ర ఉ.10.42 వరకు, తదుపరి రేవతి వర్జ్యం రా.10.01 నుంచి 11.35 వరకు దుర్ముహూర్తం ప.12.29 నుంచి 1.17 వరకు తదుపరి ప.2.40 నుంచి 3.09 వరకు అమృతఘడియలు ఉ.6.10 నుంచి 7.39 వరకు సూర్యోదయం: 6.33 సూర్యాస్తమయం: 5.30 రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు భవిష్యం మేషం: అనుకోని ప్రయాణాలు. రుణయత్నాలు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆలోచనలు అంతగా కలిసిరావు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. వృషభం: ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సంఘంలో ఆదరణ. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. మిథునం: నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. వాహనయోగం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కర్కాటకం: ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. దైవదర్శనాలు. సింహం: ఆర్థిక పరిస్థితి అంత గా అనుకూలించదు. శ్రమాధిక్యం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ప్రయాణాలలో మార్పులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. కన్య: ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. ఆకస్మిక ధనలాభం. చిరకాల మిత్రుల కలయిక. అరుదైన సన్మానాలు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి లాభం. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృశ్చికం: పనులు నిదానంగా సాగుతాయి. విద్య, ఉద్యోగావకాశాలు నిరాశ కలిగించవచ్చు. సోదరులతో వివాదాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ధనుస్సు: పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం. మకరం: శుభకార్యాలకు హాజరవుతారు. ఉద్యోగలాభం. కొన్ని వివాదాల పరిష్కారం. భూ, గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. కుంభం: కొన్ని వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. నిర్ణయాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ఆకస్మిక ప్రయాణాలు. మీనం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, ఆదివారం 28, డిసెంబర్ 2014
శ్రీజయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం; తిథి శు.సప్తమి సా.5.11 వరకు తదుపరి అష్టమి నక్షత్రం పూర్వాభాద్ర ప.12.11 వరకు తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం రా.9.11 నుంచి 10.41 వరకు దుర్ముహూర్తం సా.4.00 నుంచి 4.50 వరకు అమృతఘడియలు ..లేవు సూర్యోదయం: 6.32; సూర్యాస్తమయం: 5.29 రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు భవిష్యం మేషం: పనులు నెమ్మదిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. వృషభం: చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విందువినోదాలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మిథునం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. కర్కాటకం: మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. సింహం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. కన్య: శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. తుల: సోదరులతో సఖ్యత. వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. కొన్ని వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితి. దైవదర్శనాలు. వృశ్చికం: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో అనుకోని మార్పులు. ధనుస్సు: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి. మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. పనులు సాఫీగా సాగుతాయి. వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. కుంభం: కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. మీనం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, శనివారం 27, డిసెంబర్ 2014
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి శు.షష్ఠి రా.7.22 వరకు నక్షత్రం శతభిషం ప.1.47 వరకు తదుపరి పూర్వాభాద్ర వర్జ్యం రా.7.47 నుంచి 9.17 వ రకు దుర్ముహూర్తం ఉ.6.30 నుంచి 8.00 వరకు అమృతఘడియలు ఉ.7.03 నుంచి 8.29 వరకు సూర్యోదయం: 6.31 సూర్యాస్తమయం: 5.29 రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు భవిష్యం మేషం: దూరపు బంధువులతో సఖ్యత. విందువినోదాలు. పనుల్లో పురోగతి. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. వృషభం: ఉద్యోగలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మిథునం: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. కర్కాటకం: కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సింహం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో ఆదరణ. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. కన్య: పొరపాట్లు సరిదిద్దుకుని పనులు పూర్తి చేస్తారు. మీ ఆశలు నెరవేరతాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. తుల: పనులు కొన్ని వాయిదా పడతాయి. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు ఉంటాయి. అనుకోని ధన వ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. వృశ్చికం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ధనుస్సు: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలకు హాజరవుతారు. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. దైవదర్శనాలు. మకరం: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. కుంభం: శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనుల్లో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. మీనం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం (ఆదివారం 22, డిసెంబర్ 2014)
శ్రీజయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి అమావాస్య ఉ.7.29 వరకు తదుపరి పుష్య శు.పాడ్యమి, నక్షత్రం మూల రా.8.54 వరకు, వర్జ్యం ఉ.5.11 నుంచి 6.44 వరకు తదుపరి రా.7.19 నుంచి 8.54 వరకు దుర్ముహూర్తం ప.12.22 నుంచి 1.11 వరకు తదుపరి ప.2.34 నుంచి 3.24 వరకు అమృతఘడియలు ప.2.34 నుంచి 4.10 వరకు సూర్యోదయం:6.29 సూర్యాస్తమయం: 5.26 రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు భవిష్యం మేషం: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. అనారోగ్యం. కుటుంబసభ్యుల తో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు. వృషభం: శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. ప నుల్లో స్వల్ప ఆటంకాలు. దనవ్యయం. బం దువులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళం. దైవదర్శనాలు. మిథునం: వృత్తి, వ్యా పారాలు సాఫీ గా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. కర్కాటకం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహన, గృహయోగం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. సింహం: పనులు నిరాశ కలిగిస్తాయి. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కన్య: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. తుల: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృశ్చికం: కుటుంబంలో ఒత్తిడులు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. పను ల్లో జాప్యం. ఆలయ దర్శనాలు. బంధువులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి మార్పులు. ధనుస్సు: శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. పరపతి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. మకరం: వ్యయప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులు. ఆలయ దర్శనాలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు. అనారోగ్యం. కుంభం: కుటుంబసభ్యుల ప్రోత్సాహం. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. మీనం: కొత్త ఉద్యోగాలలో చేరతారు. ప రిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సమాచారం. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం (సోమవారం 22, డిసెంబర్ 2014)
భవిష్యం మేషం: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. అనారోగ్యం. కుటుంబసభ్యుల తో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు. వృషభం: శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. ప నుల్లో స్వల్ప ఆటంకాలు. దనవ్యయం. బం దువులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళం. దైవదర్శనాలు. మిథునం: వృత్తి, వ్యా పారాలు సాఫీ గా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. కర్కాటకం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహన, గృహయోగం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. సింహం: పనులు నిరాశ కలిగిస్తాయి. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కన్య: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. తుల: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృశ్చికం: కుటుంబంలో ఒత్తిడులు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. పను ల్లో జాప్యం. ఆలయ దర్శనాలు. బంధువులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి మార్పులు. ధనుస్సు: శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. పరపతి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. మకరం: వ్యయప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులు. ఆలయ దర్శనాలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు. అనారోగ్యం. కుంభం: కుటుంబసభ్యుల ప్రోత్సాహం. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. మీనం: కొత్త ఉద్యోగాలలో చేరతారు. ప రిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సమాచారం. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం (ఆదివారం 21, డిసెంబర్ 2014)
శ్రీజయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.చతుర్దశి ఉ.8.27 వరకు తదుపరి అమావాస్య నక్షత్రం జ్యేష్ఠ రా.9.21 వరకు వర్జ్యం ...లేదు. దుర్ముహూర్తం సా.4.00 నుంచి 4.52 వరకు. అమృతఘడియలు ప.12.36 నుంచి 2.11 వరకు సూర్యోదయం: 6.28; సూర్యాస్తమయం: 5.26 రాహుకాలం: ఉ.4.30 నుంచి 6.00 వరకు యమగండం: ఉ.12.00 నుంచి 1.30 వరకు భవిష్యం మేషం: ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్యమైన పనులలో జాప్యం. ఆధ్యాత్మిక చింతన. విద్యార్థుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. వృషభం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. సంఘంలో గౌరవం. కర్కాటకం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. అనుకోని ప్రయాణాలు. శ్రమ తప్పదు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు. సింహం: కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజకనంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. కన్య: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహారాలలో విజయం. విద్యార్థులకు ప్రోత్సాహకరం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. తుల: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. వృశ్చికం: చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పనులలో విజయం. కొన్ని వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ధనుస్సు: మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో అనుకూలం. అరుదైన సన్మానాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. కుంభం: నిరుద్యోగులకు ముఖ్య సమాచారం. శుభవార్తలు అందుతాయి. పనులు చకచకా సాగుతాయి. ఆకస్మిక ధన,వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. దైవదర్శనాలు. మీనం: పనుల్లో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, శుక్రవారం 19, డిసెంబర్ 2014
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి బ.ద్వాదశి ఉ.9.19 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.9.23 వరకు వర్జ్యం రా.1.23 నుంచి 3.00 వరకు దుర్ముహూర్తం ఉ.8.43 నుంచి 9.34 వరకు తదుపరి ప.12.28 నుంచి 1.17 వరకు అమృతఘడియలు ప12.20 నుంచి 1.57 వరకు సూర్యోదయం: 6.28 సూర్యాస్తమయం: 5.26 రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు భవిష్యం మేషం: పనుల్లో పురోగతి. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆస్తిలాభం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దైవదర్శనాలు. మిథునం: మిత్రులు, బందువులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. కర్కాటకం: బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. సింహం: మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగయోగం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవదర్శనాలు. కన్య: ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. శ్రమ పెరుగుతుంది. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప ఆటంకాలు. తుల: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. వస్తులాభాలు. వివాదాల పరిష్కారం. సంఘంలో గౌరవం. భూ, గృహలాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. వృశ్చికం: మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో జాప్యం. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ధనుస్సు: ఉద్యోగలాభం. పనుల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. మకరం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. కుంభం: మిత్రులు, కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. శ్రమ తప్పదు. ధనవ్యయం. పనుల్లో జాప్యం. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. మీనం: ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, గురువారం 18, డిసెంబర్ 2014
శ్రీజయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి బ.ఏకాదశి ఉ.8.55 వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం స్వాతి రా.8.42 వరకు వర్జ్యం రా.2.27 నుంచి 4.06 వరకు దుర్ముహూర్తం ఉ.10.15 నుంచి 11.06 వరకు తదుపరి ప.2.38 నుంచి 3.28 వరకు అమృతఘడియలు ఉ.11.24 నుంచి 12.34 వరకు సూర్యోదయం : 6.27 సూర్యాస్తమయం : 5.25 రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు ఈ రోజు రాశి ఫలాలు మేషం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృషభం:దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. పోటీపరీక్షల్లో విజయం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. మిథునం: పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. కర్కాటకం: కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు. సింహం: ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. పనులు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థికాభివృద్ధి. రుణబాధలు తొలగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కన్య: చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంతగానే ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. తుల: మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వాహనయోగం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. వృశ్చికం: వ్యవహారాలలో నిరుత్సాహం. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. అనారోగ్యం. ధనుస్సు: కొత్త ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. మకరం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. కుంభం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. మీనం: మిత్రులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, బుధవారం 17, డిసెంబర్ 2014
శ్రీజయనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.దశమి ఉ.8.10 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం చిత్త రా.7.18 వరకు వర్జ్యం రా.1.13 నుంచి 2.54 వరకు దుర్ముహూర్తం ప.11.35 నుంచి 12.26 వరకు అమృతఘడియలు ప.12.28 నుంచి 2.10 వరకు సూర్యోదయం: 6.27 సూర్యాస్తమయం: 5.25 రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు భవిష్యం మేషం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం. విద్యార్థులకు ప్రయత్నాలు సఫలం. వృషభం: విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. మిథునం: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబ సమస్యలు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. కర్కాటకం: దూరప్రయాణాలు ఉంటాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. సింహం: బంధువుల తాకిడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ఆహ్వానాలు రాగలవు. కన్య: పనుల్లో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. ఇంటాబయటా ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. తుల: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. సేవలకు గుర్తింపు రాగలదు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృశ్చికం: బంధువులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహమే. ధనుస్సు: శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. మీ సత్తా చాటుకుంటారు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మకరం: ఆత్మీయులు, మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆశ్చర్యకమైన సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. కుంభం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. మీనం: ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. దైవదర్శనాలు. విద్యార్థులకు ఒత్తిడులు. సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, మంగళవారం 16, డిసెంబర్ 2014
శ్రీ జయనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి బ.నవమి ఉ.6.40 వరకు తదుపరి దశమి, నక్షత్రం హస్త సా.5.42 వరకు తదుపరి చిత్త వర్జ్యం రా.2.13 నుంచి 3.55 వరకు దుర్ముహూర్తం ఉ.8.39 నుంచి 9.29 వరకు తదుపరి రా.10.37 నుంచి 11.27 వరకు అమృతఘడియలు ఉ.11.08 నుంచి 12.54 వరకు సూర్యోదయం: 6.26 సూర్యాస్తమయం: 5.24 రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు ధనుస్సంక్రమణం ప్రారంభం ఈ రోజు రాశిఫలాలు మేషం: పనులు సజావుగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. వృషభం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. నిరుద్యోగుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. మిథునం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కర్కాటకం: శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులకు ఆసక్తికరమైన సమాచారం. విందువినోదాలు. బంధువుల నుంచి ధనలాభం. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. సింహం: చేపట్టిన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. అనారోగ్యం. ప్రయాణాలలో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు. కన్య: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. తుల: దూరప్రయాణాలు ఉంటాయి. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. వృశ్చికం: విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. ధనుస్సు: ధనుస్సు...ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. వస్తులాభాలు. మకరం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితి. కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. పనుల్లో తొందరపాటు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మీనం: విద్య, ఉద్యోగావకాశాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం (15-12-2014)
శ్రీజయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి బ.నవమి పూర్తి నక్షత్రం ఉత్తర ప.3.29 వరకు తదుపరి హస్త వర్జ్యం రా.12.39 నుంచి 2.24 వరకు దుర్ముహూర్తం ప.12.25 నుంచి 1.15 వరకు తదుపరి ప.2.34 నుంచి 3.24 వరకు అమృతఘడియలు ఉ.7.33 నుంచి 9.18 వరకు సూర్యోదయం: 6.26 సూర్యాస్తమయం: 5.24 రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు భవిష్యం మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవం. కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం. వృషభం: పనులలో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. ఆరోగ్యభంగం. బంధువర్గంతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. మిథునం: మిత్రుల నుంచి ఒత్తిడులు, విమర్శలు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యసమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పకపోవచ్చు. దైవచింతన. కర్కాటకం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. సింహం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. పనుల్లో అవరోధాలు. ఆరోగ్యభంగం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి. కన్య: ఆస్తిలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం. తుల: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ధనవ్యయం. రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో ఆదరణ. మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ధనలాభం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. ధనుస్సు: స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థికాభివృద్ధి. పనుల్లో పురోగతి. విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. మకరం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు వద్దు. విద్యావకాశాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో మార్పులు ఉండవచ్చు. కుంభం: బంధుమిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ధనవ్యయం. పనుల్లో ఆటంకాలు. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. మీనం: ఆసక్తిరమైన సమాచారం. విందువినోదాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆస్తి లాభం. ప్రముఖులతో పరిచయాలు. ఉద్యోగయోగం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం (14-12-2014)
శ్రీ జయనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు; మార్గశిర మాసం; తిథి బ.అష్టమి తె.4.34వరకు(తెల్లవారితే సోమవారం) నక్షత్రం పుబ్బ ప.1.04 వరకు తదుపరి ఉత్తర వర్జ్యం రా.8.56 నుంచి 10.44 వరకు దుర్ముహూర్తం సా.4.04 నుంచి 4.54 వరకు అమృతఘడియలు ఉ.5.56 నుంచి 7.43 వరకు సూర్యోదయం: 6.25; సూర్యాస్తమయం: 5.24 రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం: ఉ.12.00 నుంచి 1.30 వరకు మేషం: ఆర్థికంగా ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. వృషభం: అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. పుణ్యక్షేత్రాల సందర్శనం. అనారోగ్యం. కొన్ని పనుల్లో జాప్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థుల యత్నాలు నిదానంగా సాగుతాయి. మిథునం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కర్కాటకం: కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఒప్పందాలు వాయిదా. పనుల్లో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహమే. సింహం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కన్య: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. తుల: ఇంటర్వ్యూలు అందుతాయి. కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి. ఆస్తిలాభం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. దైవదర్శనాలు. విందువినోదాలు. వృశ్చికం: ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. ధనుస్సు: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ధనవ్యయం. మకరం: నిర్ణయాలలో మార్పులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ఇంటాబయటా చికాకులు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుంభం: ఆస్తి వివాదాల పరిష్కారం. వాహన, గృహయోగాలు. పనుల్లో విజయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటుంది. మీనం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. స్ధిరాస్తి వృద్ధి. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, శనివారం 13, డిసెంబర్ 2014
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.సప్తమి రా.2.28 వరకు నక్షత్రం మఖ ఉ.10.28 వరకు తదుపరి పుబ్బ వర్జ్యం రా.7.21 నుంచి 9.08 వరకు దుర్ముహూర్తం ఉ.6.25 నుంచి 7.55 వరకు అమృతఘడియలు ఉ.7.49 నుంచి 9.36 వరకు సూర్యోదయం: 6.24 సూర్యాస్తమయం: 5.23 రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు ఈ రోజు రాశిఫలాలు: మేషం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. వృషభం: మిత్రులు, బంధువులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. మిథునం: చిన్ననాటి మిత్రుల క లయిక. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. వాహనయోగం. విద్యార్థులకు శుభవార్తలు. కర్కాటకం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. రుణయత్నాలు. బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. సింహం: ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు. భూవివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. కన్య: మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. ఆరోగ్యభంగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం. తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహన, కుటుంబసౌఖ్యం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో సానుకూల పరిస్థితి. విద్యార్థులకు ముఖ్య సమాచారం. వృశ్చికం: నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ధనుస్సు: రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం. మకరం: దూరపు బంధువుల క లయిక. పనుల్లో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు సంభవం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. కుంభం: ఒక ముఖ్య వ్యవహారంలో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. ఇంటర్వ్యూలు అందతాయి. వాహన, గృహయోగాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మీనం: మీ శ్రమ ఫలిస్తుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటిలో శుభకార్యాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, శుక్రవారం, 12 డిసెంబర్ 2014
శ్రీ జయనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి బ.షష్ఠి రా.12.14 వరకు నక్షత్రం ఆశ్లేష ఉ.7.47 వరకు తదుపరి మఖ వర్జ్యం రా.9.08 నుంచి 10.54 వరకు దుర్ముహూర్తం ఉ.8.45 నుంచి 9.35 వరకు తదుపరి ప.12.23 నుంచి 1.13 వరకు అమృతఘడియలు ఉ.6.03 నుంచి 7.48 వరకు సూర్యోదయం: 6.23 సూర్యాస్తమయం: 5.22 రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు భవిష్యం మేషం: వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన. వృషభం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. మిథునం: పరిచయా లు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దైవదర్శనాలు. కర్కాటకం: పనుల్లో జాప్యం. ఆరోగ్య సమస్యలు. ఆస్తి వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి,వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. సింహం: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. కన్య: బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. తుల: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. భూ, గృహయోగాలు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం. వృశ్చికం: ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ముందుడుగు వేస్తారు. ధనుస్సు: రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. మకరం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. భూవివాదాలు నెలకొంటాయి. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆస్తిలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలం. మీనం: కొత్త పనులు ప్రారంభిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్యార్థుల యత్నాలు సఫలం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, గురువారం, డిసెంబర్ 11, 2014
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.పంచమి రా.10.08 వరకు నక్షత్రం ఆశ్లేష పూర్తి వర్జ్యం రా.7.27 నుంచి 9.11 వరకు దుర్ముహూర్తం ఉ.10.12 నుంచి 11.01 వరకు తదుపరి ప.2.35 నుంచి 3.23 వరకు అమృతఘడియలు ..లేవు సూర్యోదయం : 6.23 సూర్యాస్తమయం : 5.22 రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు భవిష్యం మేషం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా వ్యతిరేకత. కుటుంబంలో కొద్దిపాటి వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృషభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఇంటర్వ్యూలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మిథునం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. అనారోగ్యం. కర్కాటకం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటుంది. సింహం: వ్యయప్రయాసలు. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ధనవ్యయం. కన్య: మిత్రుల నుంచి ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. తుల: రుణాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. విందువినోదాలు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. దైవదర్శనాలు. వృశ్చికం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. సోదరులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనుస్సు: ప్రయాణాలు వాయిదా. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి. మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. కుంభం: చిరకాల మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. మీనం: బంధువర్గంతో వివాదాలు. ధనవ్యయం. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. అనుకోని ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, బుధవారం, డిసెంబర్ 10, 2014
శ్రీ జయనామ సంవత్సరం,దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం తిథి బ.చవితి రా.8.15 వరకు, నక్షత్రం పుష్యమి తె.5.15 వరకు (తెల్లవారితే గురువారం) వర్జ్యం ప.11.51 నుంచి 1.35 వరకు దుర్ముహూర్తం ప.11.51 నుంచి 12.28 వరకు అమృతఘడియలు రా.10.16 నుంచి 12.00 వరకు సూర్యోదయం:6.23 , సూర్యాస్తమయం: 5.22 రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు --------- ఈరోజు రాశిఫలాలు మేషం: పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి,వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. వృషభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందువినోదాలు. విద్య, ఉద్యోగావకాశాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. మిథునం: మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. దూరప్రయాణాలు. కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సింహం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ధనవ్యయం. కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. వ్యాపార,ఉద్యోగాలలో అనుకూలత. తుల: నూతన ఉద్యోగయోగం. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. వృశ్చికం: బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆస్తి వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. నిరుద్యోగులకు నిరుత్సాహం. ధనుస్సు: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. మిత్రులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మకరం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. కుంభం: పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. మీనం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. - సింహంభట్ల సుబ్బారావు -
ఘనంగా ఉగాది వేడుకలు
సాక్షి, ముంబై: ఆంధ్రమహాసభలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం నిర్వహించిన శ్రీ జయనామ సంవత్సర ఉగాది వేడుకల్లో ముఖ్య అతిధిగా నాళేశ్వరం శంకరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతాలు వేరైనా భాష ఒక్కటేనని, అయితే ఆయా ప్రాంతాలు తమ యాసను గౌరవించుకొంటూ మిగతా ప్రాంతాల యాసను గౌరవించాలని తెలియచేశారు. సంవత్సరంలో ఆరు రుతువులకు షడ్రుచుల ఉగాది పచ్చడి ప్రతీక అని తెలిపారు. ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్ సభకు స్వాగతం పలుకుతూ నూతన కార్యవర్గం మహసభకు పునర్వైభవం తెచ్చేందుకు కట్టుబడి ఉందని, నాణ్యత కలిగిన కార్యక్రమాలను నిర్వహిస్తామని హామీ ఉచ్చారు. జ్యోతి ప్రజ్వలానంతరం మోహన్ పండితుల ద్వారా పంచాంగ శ్రవణం జరిగింది. తర్వాత జరిగిన కవిసమ్మేళనానికి నాళేశ్వరం శంకరం అధ్యక్షత వహించారు. గౌరవ అతిథిగా ప్రముఖ శాస్త్రవేత్త నాగేశ్వరావు వేదికనలంకరించారు. ఈ కవి సమ్మేళనంలో అంబల్ల జనార్ధన్, సంగినేని రవీంద్ర, మచ్చ ప్రభాకర్, గాలి మురళీధర్, యు.కె. మేఘ, యెల్టి సుదర్శన్ పద్మశాలి, జ్వలిత, గుర్రపు కిషన్, ఏవీ అనంతరామ్, గట్టు నర్సయ్య, నడిమెట్ల యెల్లప్ప, పి. భారతలక్ష్మి, గుంటక పరుశురాం, గుర్రం బాలరాజు తదితరులు తమ కవితల్ని వినిపించారు. ప్రముఖ రచయిత్రి తురగా జయ శ్యామల, డా. హరికిషన్ తెలుగు భాష గురించి వివరించారు. కవిసమ్మేళనానికి వ్యాఖ్యాతగా సాహిత్యవిభాగ ఉపాధ్యక్షుడు నడిమెట్ల యెల్లప్ప వ్యవహరించారు. వేదికపై అతిథులతో పాటు అధ్యక్షుడు సంకు సుధాకర్, ధర్మకర్తల మండలి కార్యదర్శి మంతెన రమేశ్, ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్ ఆసీనులయ్యారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీ చైర్మన్ ఏక్నాథ్ సంగం, సభ్యులు పోతు రాజారాం, పరిపాలనా శాఖ ఉపాధ్యక్షుడు అనుమల్ల రమేశ్, సాంస్కృతిక శాఖ ఉపాధ్యక్షుడు గట్టునర్సయ్య, కోశాధికారి రాంపెల్లి పరమేశ్వర్, బడుగు విశ్వనాథ్, సిరిమల్లె శ్రీనివాస్, రాంపెల్లి జ్ఞానేశ్వర్, తాటికొండ మోతీరాం, కస్తూరి హరిప్రసాద్, బైరం రాంమోహన్, మహిళా శాఖ అధ్యక్షురాలు పి. భరతలక్ష్మి, కార్యదర్శి సోమల్ లత, సభ్యులు సంగినేని విజయ, అపరాజిత, కరుణ, దేవీరావు, పి.పద్మ, వై.లత పాల్గొన్నారు. కొడిమ్యాల్లో... కొడిమ్యాల్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్థానికులకు పచ్చడి పంపిణీ చేశామని ఆ సంస్థ అధ్యక్షుడు మంచాల దేవయ్య, ప్రధాన కార్యదర్శి వేముల మనోహర్, కోశాధికారి గుర్రం శ్రీనివాస్ తెలిపారు. బేలాపూర్‌లో.. బేలాపూర్‌లోని తెలుగు కళా వేదిక ఆధ్వర్యంలో జనార్ధన్ శాస్త్రి పంచాంగ శ్రవణం గావించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భివండీలో.. భివండీ, న్యూస్‌లైన్: పద్మశాలి సమాజ్ యువక్ మండలి ఆధ్వర్యాన ప్రేమాతాయి మంగళ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా సాంస్కృతిక కార్యాక్రమాలు, గత నెల రోజుల క్రితం నిర్వహించిన పద్మశాలి క్రీడా మహోత్సావాలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా టాలీవుడ్ హీరోలు వేణు, రోషన్ బాలు, హాస్య నటుడు చిత్రం శ్రీనివాస్, అంక్యార్ బులెట్ పద్మినితో పాటు స్థానిక కార్పొరేటర్ సంతోష్ ఎం. శెట్టి, శశిలత శెట్టి, సభాపతులు మురళి మచ్చ, గాజెంగి రాజు తదితరులు హాజరయ్యారు. పద్మశాలి కులానికి చెందిన టాలీవుడ్ హీరో రోషన్ బాలు మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తెలంగాణ నుంచి వేళ్లపై లెక్కపెట్టేంతమందే హీరోలున్నారన్నారు. రాబోయే కాలంలో తెలంగాణ చిత్రపరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి అవకాశం కల్పించిన కొండా బాపూజీని మనం తెలంగాణ జాతిపితగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో పద్మశాలి కులానికి చెందిన మాజీ కార్పొరేటర్లు దాసి అంబాదాస్, కళ్యాడపు బాలకిషన్, పాశికంటి లచ్చయ్య, వంగ పురుషోత్తం, కుందెన్ పురుషోత్తం, డాక్టర్ పాము మనోహర్, కళ్యాడపు భూమేష్, భీమనాథిని శివప్రసాద్, భైరి నిష్కం, పాము ఈశ్వర్, మేర్గు భాస్కర్, బాలే శ్రీనివాస్, ఆసం రాజేందర్ హాజరైయ్యారు. బోరివలిలో.. సాక్షి, ముంబై: తెలంగాణ యువజన కార్మిక సంఘం (టీవైకే ఎస్) ఆధ్వర్యంలో బోరివలి దౌలత్నగర్లోని ఆధార్ హాలులో ఉగాది నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన బోరివలి-దహిసర్ ఎమ్మెల్యే వినోద్ గోసాల్కర్, స్థానిక కార్పొరేటర్ అభిషేక్ గోసాల్కర్ పలు క్రీడాపోటీల్లో విజేతలైన మహిళలు, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తెలంగాణ ప్రజలకు శివసేన ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. భారీ సంఖ్యలో హాజరైన మహిళలు పసుపు-కుంకుమ జరుకుకున్నారు. కార్యక్రమంలో టీవైకేఎస్ అధ్యక్షుడు ఉప్పు భూమన్న, ఉపాధ్యక్షుడు పురంశెట్టి గోపాల్, ప్రధాన కార్యదర్శి గాజుల మహేశ్, ఎంటీజేఏసీ నాయకులు పాల్గొన్నారు. నవోదయ కళా మంచ్, బహుజన దరువు కళా బృందం సంయుక్తంగా సాంస్కృతిక పాటలతో హోరెత్తించారు. నాయ్‌గావ్‌లో.. దాదర్ నాయ్‌గావ్‌లోని పద్మశాలి యువక సంఘం ఆధ్వర్యంలో స్థానికులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. కార్యక్రమానికి దాదాపు 120 మందికిపైగా సభ్యులు హాజరయ్యార ని ట్రస్టీ సభ్యులు అనబత్తుల ప్రమోద్, ట్రస్టీ చైర్మన్ పాపని సుదర్శన్, అధ్యక్షుడు కోడి చంద్రమౌళి, ఉపాధ్యక్షుడు పొన్న శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కస్తూరి సుధాకర్ తెలిపారు. -
వైభవంగా ఉగాది ఆస్థానం
ఆలయంలో పంచాంగ శ్రవణం శ్రీవారికి నూతన పట్టువస్త్రాల సమర్పణ మహాభారతం గ్రంథావిష్కరణ సాక్షి, తిరుమల : జయనామ సంవత్సరాదిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉగాది ఆస్థానం వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతం, తోమాల సేవ శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. తర్వాత ఉదయం 6 గంటలకే బంగారు వాకిలిలో సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని వేంచేపు చేశారు. ఆలయ పెద్ద జీయరు, చినజీయరు, చైర్మన్, ఈవో, జేఈవో సతీసమేతంగా నూతన పట్టువస్త్రాలు ప్రదర్శనగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. అనంతరం శాస్రోక్తంగా ఆస్థానం పూజలు నిర్వహించారు. స్వామివారి పాద పద్మాల వద్ద ఉంచిన నూతన సంవత్సర పంచాంగాన్ని ఆస్థాన సిద్ధాంతి శ్రవణం చేశారు. నూతన సంవత్సర ఫలితాలు, లాభ నష్టాలు, నవగ్రహాలు, సస్యవృద్ధి, పశువృద్ధి, 27నక్షత్ర జాతకుల కందాయ ఫలాలు, రాజ పూజ్యం, అవమానాలు స్వామివారికి వినిపించారు. కాగా, ఆలయం మహద్వారం నుంచి గర్భాలయం వరకు సంప్రదాయ పుష్పాలు, పలు రకాల పండ్లతో చేసిన ప్రత్యేక అలంకరణలు భక్తులను విశేషం గా ఆకట్టుకున్నాయి. ధ్వజస్తంభం, బలిపీఠం అలంకరణతో పాటు పండ్లు, కూరగాయలతో ఏర్పాటు చేసిన దశావతారాలు, వివిధ పశుపక్ష్యాదుల ఆకృతులు భక్తులను మైమరపించాయి. కార్యక్రమం అనంతరం టీటీడీ పునఃముద్రించిన ‘కవిత్రయ మహాభారతం’ గ్రంథాన్ని చైర్మన్, ఈవో, జేఈవోలు ఆవిష్కరించారు. -
జయ నామ సంవత్సరంలో మరింత అభివృద్ధి
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జయ నామ సంవత్సరంలో జిల్లాలో మరింత అభివృద్ధి జరగాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆకాంక్షించారు. నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వం నగరాలు, పట్టణాలు, గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. జయ నామ సంవత్సరం సందర్భంగా సోమవారం ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో కలెక ్టర్ ప్రసంగించారు. అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించి ప్రజలకు సేవ చేయాలని, అభివృద్ధి పనులు జరిగేలా చూడాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ కే యాకూబ్ నాయక్ మాట్లాడుతూ.. ఈ ఏడాది వర్షాలు బాగా పడతాయని చెప్పారు. రైతులు అధిక దిగుబడి సాధించి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులతో పాటు అన్ని రంగాలకు చెందిన వారికి శుభం కలగాలని కోరారు. కార్యక్రమంలో ఏజేసీ ప్రకాష్‌కుమార్, డీఆర్ఓ జీ గంగాధర్‌గౌడ్, స్టెప్ సీఈఓ బీ రవి, డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్ కే పోలప్ప, ఇరిగేషన్ ఎస్ఈ కోటేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎం జ్వాలానరసింహం పాల్గొన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ విజయకుమార్‌కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలను ప్రారంభించారు. ప్రముఖ పురోహితుడు మఠంపల్లి దక్షిణామూర్తి పంచాం గాన్ని చదివి వినిపించారు. అక్షర సాహితీ సమితి అధ్యక్షుడు మాజేటి వెంకటసుబ్బయ్యశాస్త్రి ఉగాది పర్వదిన ప్రాశస్త్యాన్ని వివరించారు. ప్రకృతికి, పండుగలకు గల అనుబంధాన్ని గుర్తుచేశారు. విజయ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. -
జయనామ సంవత్సరంలో జగనే సీఎం
ఒంగోలు అర్బన్, న్యూస్‌లైన్: జయనామ సంవత్సరంలో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పండితుడు సదాశివయ్యశాస్త్రి పంచాంగ పఠనం చేశారు. పంచాంగం ప్రకారం వైఎస్సార్ సీపీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిల గ్రహబలం బాగుందని, విశేష ప్రజాదరణ పొందుతారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బాలినేని మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయపథంలో పయనిస్తుందని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాలు మారతాయని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ వేమూరి బుజ్జి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, శింగరాజు వెంకటరావు, జిల్లా ఉపాధి కల్పన విభాగం కన్వీనర్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి, జిల్లా మహిళా కన్వీనర్ పోకల అనూరాధ, జిల్లా అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నరాల రమణారెడ్డి, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, నగర ఎస్సీ సెల్ కన్వీనర్ యరజర్ల రమేష్, నగర సేవాదళ్ కన్వీనర్ కంకణాల వెంకటరావు, నగర మహిళా కన్వీనర్ కావూరి సుశీల, నగర యూత్ కన్వీనర్ నెరుసుల రాము, నగర ప్రచార కమిటీ సెక్రటరీ రాయపాటి కోటి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు టీ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
‘చేతి’లో జాబితా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాలో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై అధిష్టానం జయనామ సంవత్సరం తొలిరోజున కొలిక్కొచ్చింది. గెలుపు గుర్రాల జాబితాను వడపోసిన ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తును పూర్తిచేసింది. జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి జాబితాకు తుది మెరుగులు దిద్దింది. పార్లమెంటు స్థానాల విషయంలో ఇంకా స్పష్టత రానప్పటికీ, శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులను మాత్రం ఖరారు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో స్వల్ప మార్పులు మినహా మెజార్టీ శాసనసభ్యులకు టికెట్లు దక్కినట్లు సమాచారం. ఉప్పల్ శాసనసభ్యుడు బండారి రాజిరెడ్డి స్థానే సోదరుడు లక్ష్మారెడ్డిని బరిలోకి దించేందుకు అధిష్టానం అంగీకరించింది. మరోవైపు ప్రముఖ సినీ నిర్మాత ఆది శేషగిరిరావును కూకట్పల్లి నుంచి బరిలో దించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణేతరులు, సినీ పరిశ్రమకు సంబంధించిన ఓటర్లు ఈ ప్రాంతంలో అధికంగా ఉన్నందున ఈయన అభ్యర్థిత్వాన్ని ఓకే చేసింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో అక్కడ నందికంటి శ్రీధర్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతోంది. ఈయనకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ పట్టుబడుతున్నారు. ఇదిలావుండగా, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అభ్యర్థిత్వంపై సర్వే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్‌కు టికెట్ ఇవ్వకుండా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మేడ్చల్‌పై జైపాల్ పట్టు తన అనుచరుడు ఉద్దెమర్రి నరసింహారెడ్డికి మేడ్చల్ టికెట్ ఇప్పించడానికి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. అధిష్టానం పెద్దలతో నేరుగా సంప్రదింపు లు జరుపుతున్న ఆయన ఉద్దెమర్రి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేలా లాబీ యింగ్ చేస్తున్నారు. ఈ పరిణామం సిట్టింగ్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని ఇరకాటంలో పడేస్తోంది. సిట్టింగ్‌లకు స్థాన మార్పిడి ఉండదనే ధీమాతో ఉన్న ఆయనకు జైపాల్ వ్యవహారశైలి మింగుడు పడడంలేదు. ఎంపీ రేసులో శశిధర్ మరోవైపు చేవెళ్ల లోక్‌సభ స్థానానికి ఎన్డీఆర్ఎఫ్ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని అధిష్టానం చురుగ్గా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈసారి మహబూబ్‌నగర్ నుంచి బరిలో దిగాలని నిర్ణయించుకున్న జైపాల్‌రెడ్డి తన స్థానంలో శశిధర్‌ను ఇక్కడి నుంచి పోటీ చేయించేందుకు వ్యూహారచన చేస్తున్నారు. ఒకవేళ శశిధర్ కనుక పోటీకి విముఖత చూపితే మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్లార్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని అధిష్టానానికి సూచించారు. తద్వారా తన అనుయాయుడు ఉద్దెమర్రికి లైన్‌క్లియర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, కేఎల్లార్ మాత్రం సిట్టింగ్ స్థానాన్ని వదిలేందుకు ససేమిరా అంటున్నారు. రాజేంద్రనగర్‌కు సబిత కుటుంబసభ్యులకు ఒక సీటే అనే హైకమాండ్ నిబంధన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫ్యామిలీని ఆత్మరక్షణలో పడేసింది. చేవెళ్ల ఎంపీ బరిలో సబితను దింపాలని అధిష్టానం భావించినా.. ఆమె మాత్రం రాజేంద్రనగర్ నుంచి తిరిగి అసెంబ్లీకి పోటీచేయాలని యోచిస్తున్నారు. ఇదే విషయాన్ని హైకమాండ్ చెవిన వేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన అగ్ర నాయకత్వం మహేశ్వరం నుంచి రాజేంద్రనగర్‌కు మారేందుకు అంగీకరించారు. అయితే, కుటుంబంలో ఒకరికే సీటు నిబంధన సబిత ఫ్యామిలీని ఇరకాటంలో పడేసింది. తనయుడు కార్తీక్‌రెడ్డి చేవెళ్ల ఎంపీగా, తాను రాజేంద్రనగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అయితే, అధిష్టానం షరతు ఆమెకు ప్రతికూలంగా మారింది. దీనికితోడు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి వ్యతిరేకంగా పావులు కదుపుతుండడం సబిత వర్గీయులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆమె అవకాశాలను దెబ్బతీయాలనే ఆలోచనతో శశిధర్ పేరును తెరమీదకు తెచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
అంతాజయమే
పరిగి, మొయినాబాద్, న్యూస్‌లైన్: జయనామ సంవత్సరానికి సోమవారం జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో స్వాగతం పలికారు. ఈ సంవత్సరం తమకు విజయాలు చేకూర్చాలని ఆకాంక్షించారు. ఉగాది పర్యదినం సందర్భంగా ప్రతి గ్రామంలో పంచా గ శ్రావణం నిర్వహించారు. తోరణాలతో ఇళ్లను అలంకరించారు. పిండివంటలు, పోలేలు, షడ్రుచులతో కూడిన పచ్చడిని ఆరగించారు. పరి గి, చేవెళ్ల, వికారాబాద్, శంషాబాద్, తాండూరు, మేడ్చల్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలోని ఆలయాలు భక్త జనంతో కిటకిటలాడాయి. ఇదిలాఉంటే ప్రస్తుతం ప్రాదేశిక పోరు జరుగుతున్న నేపథ్యంలో పంచాంగ శ్రవణానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీచేస్తున్న అభ్యర్థులు తమ పేరున బలాలు, జాతకాలు ఎలా ఉన్నాయని ఆసక్తి అడిగి తెలుసుకున్నారు. పరిగిలో పండితులు సిద్దాంతి పార్థసారథి పంచాంగ పఠనం చేయగా పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పంచాంగ పఠనాన్ని ఆలకించారు. వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయి.. జయనామ సంవత్సరంలో అంతా జయమే జరుగుతుందని చిలుకూరు బాలాజీ దేవాలయ పూజారి రంగరాజన్ పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా సోమవారం సాయంత్రం 5 గంటలకు పంచాగ శ్రవణం చేశారు. ఆలయ మండపంలో ఉత్సవమూర్తులను ప్రతిష్టించి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస రాఘవాచార్యు లు, ఆలయ మేనేజింగ్ కమిటీ చెర్మైన్ సౌదరరాజన్, కన్వీనర్ గోపాల కృష్ణస్వామిల సమక్షంలో పంచాగ శ్రవ ణం నిర్వహించారు. ఆలయ పూజారి రంగరాజన్ పంచాగ శ్రవణం చేస్తూ ఈ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పారు. రాష్ట్రం విడిపోయినా మనుషులు మాత్రం కలిసిమెలిసి ఉంటారని, ప్రేమానురాగాలు పంచుకుంటారని అన్నారు. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేసి, దేవాలయాల పరిరక్షణకుపాటు పడేవారే ఈ సారి ఎన్నికల్లో గెలుస్తారని, అలాంటి వారికే దేవుడు పట్టం కడతారని వివరించారు. పంచాయగ శ్రవణ కార్యక్రమంలో పూజారులు కన్నయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల పత్రిక ఆవిష్కరణ తెలంగాణ తిరుపతిగా పేరొందిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాల పత్రికను సోమవారం ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస రాఘవాచార్యులు, పూజారులు ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల పత్రికలను స్వామివారి పాదాల వద్ద పెట్టి పూజలు నిర్వహించారు. ఈనెల 9 నుంచి 16 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందరరాజన్ తెలిపారు.