శ్రీజయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి బ.నవమి పూర్తి నక్షత్రం ఉత్తర ప.3.29 వరకు
తదుపరి హస్త
వర్జ్యం రా.12.39 నుంచి 2.24 వరకు
దుర్ముహూర్తం ప.12.25 నుంచి 1.15 వరకు
తదుపరి ప.2.34 నుంచి 3.24 వరకు
అమృతఘడియలు ఉ.7.33 నుంచి 9.18 వరకు
సూర్యోదయం:
6.26 సూర్యాస్తమయం: 5.24
రాహుకాలం:
ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం:
ఉ.10.30 నుంచి 12.00 వరకు
భవిష్యం
మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవం. కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం.
వృషభం: పనులలో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. ఆరోగ్యభంగం. బంధువర్గంతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.
మిథునం: మిత్రుల నుంచి ఒత్తిడులు, విమర్శలు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యసమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పకపోవచ్చు. దైవచింతన.
కర్కాటకం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.
సింహం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. పనుల్లో అవరోధాలు. ఆరోగ్యభంగం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.
కన్య: ఆస్తిలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.
తుల: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ధనవ్యయం. రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో ఆదరణ. మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ధనలాభం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
ధనుస్సు: స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థికాభివృద్ధి. పనుల్లో పురోగతి. విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
మకరం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు వద్దు. విద్యావకాశాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో మార్పులు ఉండవచ్చు.
కుంభం: బంధుమిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ధనవ్యయం. పనుల్లో ఆటంకాలు. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.
మీనం: ఆసక్తిరమైన సమాచారం. విందువినోదాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆస్తి లాభం. ప్రముఖులతో పరిచయాలు. ఉద్యోగయోగం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
- సింహంభట్ల సుబ్బారావు