శ్రీ జయనామ సంవత్సరం..
శ్రీ జయనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం, తిథి బ.ద్వాదశి ఉ.9.19 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం విశాఖ రా.9.23 వరకు
వర్జ్యం రా.1.23 నుంచి 3.00 వరకు
దుర్ముహూర్తం ఉ.8.43 నుంచి 9.34 వరకు
తదుపరి ప.12.28 నుంచి 1.17 వరకు
అమృతఘడియలు ప12.20 నుంచి 1.57 వరకు
సూర్యోదయం: 6.28
సూర్యాస్తమయం: 5.26
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు
భవిష్యం
మేషం: పనుల్లో పురోగతి. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆస్తిలాభం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దైవదర్శనాలు.
మిథునం: మిత్రులు, బందువులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
కర్కాటకం: బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.
సింహం: మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగయోగం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవదర్శనాలు.
కన్య: ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. శ్రమ పెరుగుతుంది. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప ఆటంకాలు.
తుల: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. వస్తులాభాలు. వివాదాల పరిష్కారం. సంఘంలో గౌరవం. భూ, గృహలాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
వృశ్చికం: మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో జాప్యం. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
ధనుస్సు: ఉద్యోగలాభం. పనుల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.
మకరం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
కుంభం: మిత్రులు, కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. శ్రమ తప్పదు. ధనవ్యయం. పనుల్లో జాప్యం. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
మీనం: ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
- సింహంభట్ల సుబ్బారావు