గ్రహం అనుగ్రహం (14-12-2014) | Graham Anugraham of the day on december 14th | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (14-12-2014)

Published Sun, Dec 14 2014 1:37 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM

Graham Anugraham of the day on december 14th

శ్రీ జయనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు; మార్గశిర మాసం; తిథి బ.అష్టమి తె.4.34వరకు(తెల్లవారితే సోమవారం) నక్షత్రం పుబ్బ ప.1.04 వరకు
 తదుపరి ఉత్తర
 వర్జ్యం రా.8.56 నుంచి 10.44 వరకు
 దుర్ముహూర్తం సా.4.04 నుంచి
 4.54 వరకు అమృతఘడియలు
 ఉ.5.56 నుంచి 7.43 వరకు

 సూర్యోదయం: 6.25;
 సూర్యాస్తమయం: 5.24

 రాహుకాలం:

 సా.4.30 నుంచి 6.00 వరకు

 యమగండం:

 ఉ.12.00 నుంచి 1.30 వరకు
 

మేషం: ఆర్థికంగా ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు.
 
వృషభం: అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. పుణ్యక్షేత్రాల సందర్శనం. అనారోగ్యం. కొన్ని పనుల్లో జాప్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థుల యత్నాలు నిదానంగా సాగుతాయి.
 
మిథునం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

కర్కాటకం: కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఒప్పందాలు వాయిదా. పనుల్లో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహమే.
 
సింహం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 
కన్య: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
 
తుల: ఇంటర్వ్యూలు అందుతాయి. కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి.  ఆస్తిలాభం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. దైవదర్శనాలు. విందువినోదాలు.
 
వృశ్చికం
: ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
 
ధనుస్సు: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ధనవ్యయం.
 
మకరం
: నిర్ణయాలలో మార్పులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ఇంటాబయటా చికాకులు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
 
కుంభం
: ఆస్తి వివాదాల పరిష్కారం. వాహన, గృహయోగాలు. పనుల్లో విజయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటుంది.
 
మీనం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. స్ధిరాస్తి వృద్ధి.
 - సింహంభట్ల సుబ్బారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement