శ్రీ జయనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం, తిథి బ.నవమి ఉ.6.40 వరకు
తదుపరి దశమి, నక్షత్రం హస్త సా.5.42 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం రా.2.13 నుంచి 3.55 వరకు
దుర్ముహూర్తం ఉ.8.39 నుంచి 9.29 వరకు
తదుపరి రా.10.37 నుంచి 11.27 వరకు
అమృతఘడియలు ఉ.11.08 నుంచి 12.54 వరకు
సూర్యోదయం: 6.26 సూర్యాస్తమయం: 5.24
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
ధనుస్సంక్రమణం ప్రారంభం
ఈ రోజు రాశిఫలాలు
మేషం: పనులు సజావుగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
వృషభం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. నిరుద్యోగుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.
మిథునం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
కర్కాటకం: శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులకు ఆసక్తికరమైన సమాచారం. విందువినోదాలు. బంధువుల నుంచి ధనలాభం. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
సింహం: చేపట్టిన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. అనారోగ్యం. ప్రయాణాలలో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు.
కన్య: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
తుల: దూరప్రయాణాలు ఉంటాయి. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.
వృశ్చికం: విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
ధనుస్సు: ధనుస్సు...ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. వస్తులాభాలు.
మకరం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితి.
కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. పనుల్లో తొందరపాటు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
మీనం: విద్య, ఉద్యోగావకాశాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
- సింహంభట్ల సుబ్బారావు