శ్రీజయనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం, తిథి బ.ఏకాదశి ఉ.8.55 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం స్వాతి రా.8.42 వరకు
వర్జ్యం రా.2.27 నుంచి 4.06 వరకు
దుర్ముహూర్తం ఉ.10.15 నుంచి 11.06 వరకు
తదుపరి ప.2.38 నుంచి 3.28 వరకు
అమృతఘడియలు ఉ.11.24 నుంచి 12.34 వరకు
సూర్యోదయం : 6.27
సూర్యాస్తమయం : 5.25
రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు
ఈ రోజు రాశి ఫలాలు
మేషం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
వృషభం:దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. పోటీపరీక్షల్లో విజయం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
మిథునం: పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
కర్కాటకం: కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు.
సింహం: ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. పనులు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థికాభివృద్ధి. రుణబాధలు తొలగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కన్య: చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంతగానే ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి.
తుల: మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వాహనయోగం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
వృశ్చికం: వ్యవహారాలలో నిరుత్సాహం. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. అనారోగ్యం.
ధనుస్సు: కొత్త ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
మకరం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.
కుంభం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు.
మీనం: మిత్రులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
- సింహంభట్ల సుబ్బారావు