శ్రీ జయనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం, తిథి బ.షష్ఠి రా.12.14 వరకు
నక్షత్రం ఆశ్లేష ఉ.7.47 వరకు
తదుపరి మఖ
వర్జ్యం రా.9.08 నుంచి 10.54 వరకు
దుర్ముహూర్తం ఉ.8.45 నుంచి 9.35 వరకు
తదుపరి ప.12.23 నుంచి 1.13 వరకు
అమృతఘడియలు ఉ.6.03 నుంచి 7.48 వరకు
సూర్యోదయం: 6.23 సూర్యాస్తమయం: 5.22
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు
భవిష్యం
మేషం: వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన.
వృషభం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
మిథునం: పరిచయా లు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దైవదర్శనాలు.
కర్కాటకం: పనుల్లో జాప్యం. ఆరోగ్య సమస్యలు. ఆస్తి వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి,వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు.
సింహం: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
కన్య: బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.
తుల: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. భూ, గృహయోగాలు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.
వృశ్చికం: ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ముందుడుగు వేస్తారు.
ధనుస్సు: రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
మకరం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. భూవివాదాలు నెలకొంటాయి. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆస్తిలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలం.
మీనం: కొత్త పనులు ప్రారంభిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్యార్థుల యత్నాలు సఫలం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
- సింహంభట్ల సుబ్బారావు
గ్రహం అనుగ్రహం, శుక్రవారం, 12 డిసెంబర్ 2014
Published Fri, Dec 12 2014 1:17 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM
Advertisement
Advertisement