శ్రీ జయనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి శు.షష్ఠి రా.7.22 వరకు
నక్షత్రం శతభిషం ప.1.47 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం రా.7.47 నుంచి 9.17 వ రకు
దుర్ముహూర్తం ఉ.6.30 నుంచి 8.00 వరకు
అమృతఘడియలు ఉ.7.03 నుంచి 8.29 వరకు
సూర్యోదయం: 6.31
సూర్యాస్తమయం: 5.29
రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు
భవిష్యం
మేషం: దూరపు బంధువులతో సఖ్యత. విందువినోదాలు. పనుల్లో పురోగతి. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృషభం: ఉద్యోగలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మిథునం: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు.
కర్కాటకం: కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
సింహం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో ఆదరణ. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన.
కన్య: పొరపాట్లు సరిదిద్దుకుని పనులు పూర్తి చేస్తారు. మీ ఆశలు నెరవేరతాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
తుల: పనులు కొన్ని వాయిదా పడతాయి. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు ఉంటాయి. అనుకోని ధన వ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
వృశ్చికం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.
ధనుస్సు: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలకు హాజరవుతారు. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. దైవదర్శనాలు.
మకరం: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి.
కుంభం: శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనుల్లో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
మీనం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.
- సింహంభట్ల సుబ్బారావు
గ్రహం అనుగ్రహం, శనివారం 27, డిసెంబర్ 2014
Published Sat, Dec 27 2014 2:27 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM
Advertisement
Advertisement