గ్రహం అనుగ్రహం (ఆదివారం 21, డిసెంబర్ 2014) | Graham Anugraham, Sunday 21, December 2014 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (ఆదివారం 21, డిసెంబర్ 2014)

Published Sun, Dec 21 2014 1:34 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM

Graham Anugraham, Sunday 21, December 2014

శ్రీజయనామ సంవత్సరం
 దక్షిణాయనం, హేమంత ఋతువు
 మార్గశిర మాసం
 తిథి బ.చతుర్దశి ఉ.8.27 వరకు
 తదుపరి అమావాస్య
 నక్షత్రం జ్యేష్ఠ రా.9.21 వరకు
 వర్జ్యం ...లేదు. దుర్ముహూర్తం సా.4.00 నుంచి 4.52 వరకు. అమృతఘడియలు ప.12.36 నుంచి 2.11 వరకు
 సూర్యోదయం: 6.28;
 సూర్యాస్తమయం: 5.26

 రాహుకాలం:

 ఉ.4.30 నుంచి 6.00 వరకు

 యమగండం:

 ఉ.12.00 నుంచి 1.30 వరకు

భవిష్యం
 
మేషం: ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్యమైన పనులలో జాప్యం. ఆధ్యాత్మిక చింతన. విద్యార్థుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. సంఘంలో గౌరవం.
 
కర్కాటకం:
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. అనుకోని ప్రయాణాలు. శ్రమ తప్పదు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.
 
సింహం: కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజకనంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
 
కన్య:
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహారాలలో విజయం. విద్యార్థులకు ప్రోత్సాహకరం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
 
తుల:
కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో  మార్పులు ఉండవచ్చు.
 
వృశ్చికం: చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పనులలో విజయం. కొన్ని వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
 
ధనుస్సు: మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
 
మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో అనుకూలం. అరుదైన సన్మానాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
 
కుంభం: నిరుద్యోగులకు ముఖ్య సమాచారం. శుభవార్తలు అందుతాయి. పనులు చకచకా సాగుతాయి. ఆకస్మిక ధన,వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. దైవదర్శనాలు.
 
మీనం
: పనుల్లో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

 - సింహంభట్ల సుబ్బారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement