శ్రీ జయనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి బ.పంచమి రా.10.08 వరకు
నక్షత్రం ఆశ్లేష పూర్తి
వర్జ్యం రా.7.27 నుంచి 9.11 వరకు
దుర్ముహూర్తం ఉ.10.12 నుంచి 11.01 వరకు
తదుపరి ప.2.35 నుంచి 3.23 వరకు
అమృతఘడియలు ..లేవు
సూర్యోదయం : 6.23
సూర్యాస్తమయం : 5.22
రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు
భవిష్యం
మేషం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా వ్యతిరేకత. కుటుంబంలో కొద్దిపాటి వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.
వృషభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఇంటర్వ్యూలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
మిథునం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. అనారోగ్యం.
కర్కాటకం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటుంది.
సింహం: వ్యయప్రయాసలు. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ధనవ్యయం.
కన్య: మిత్రుల నుంచి ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
తుల: రుణాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. విందువినోదాలు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. దైవదర్శనాలు.
వృశ్చికం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. సోదరులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనుస్సు: ప్రయాణాలు వాయిదా. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.
మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కుంభం: చిరకాల మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
మీనం: బంధువర్గంతో వివాదాలు. ధనవ్యయం. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. అనుకోని ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. - సింహంభట్ల సుబ్బారావు
గ్రహం అనుగ్రహం, గురువారం, డిసెంబర్ 11, 2014
Published Thu, Dec 11 2014 1:25 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM
Advertisement
Advertisement