
గ్రహం అనుగ్రహం(14-08-2015)
శ్రీ మన్మథనామ సంవత్సరం
శ్రీ మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
నిజ ఆషాఢ మాసం
తిథి అమావాస్య రా.7.20 వరకు
నక్షత్రం ఆశ్లేష రా.1.32 వరకు
వర్జ్యం ప.1.27 నుంచి 3.11 వరకు
దుర్ముహూర్తం ఉ.8.20 నుంచి 9.11 వరకు
తదుపరి ప.12.31 నుంచి 1.21 వరకు
అమృతఘడియలు రా.11.47 నుంచి 1.30 వరకు
భవిష్యం
మేషం: దూరప్రయాణాలు చేస్తారు. మిత్రులతో మాటపట్టింపులు వచ్చే అవకాశముంది. అనా రోగ్యం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు కలసిరావు. దైవ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
వృషభం: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభ కార్యాలకు హాజరవుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థులకు శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో నూతనోత్సాహం.
మిథునం: సన్నిహి తులతో విభేదాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. భూ వివాదాలు నెలకొంటాయి. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.
కర్కాటకం: నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
సింహం: వ్యయ ప్రయాసలు. బంధు విరోధాలు. శ్రమాధిక్యం. పనుల్లో తొందర పాటు ప్రదర్శిస్తారు. ప్రయాణాలలో మార్పులు చోటుచేసుకుంటాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కన్య: ఉద్యోగ యత్నాలు సానుకూలంగా ఉంటాయి. విందు వినోదాలు. కార్యజయం. ఆప్తుల సలహాలతో ముందుకు సాగుతారు. వస్తు,వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
తుల: అనుకోని అతిథుల ద్వారా ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృశ్చికం: మిత్రులతో వివాదాలు రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు. మానసిక అశాంతి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
ధనుస్సు: బంధువులను కలుసుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు చోటుచేసుకుంటాయి.
మకరం: పాతమిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. వస్తు లాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది.
కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి లాభం వస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మీనం: కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తప్పదు.
- సింహంభట్ల సుబ్బారావు