
గ్రహం అనుగ్రహం ( 31-08-2015 )
శ్రీమన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి
శ్రీమన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి బ.విదియ రా.8.30 వరకు, నక్షత్రం పూర్వాభాద్ర ప.2.01 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం రా.10.50 నుంచి 12.18 వరకు, దుర్ముహూర్తం ప.12.24 నుంచి 1.14 వరకు, తదుపరి ప.2.54 నుంచి 3.44 వరకు, అమృతఘడియలు ఉ.6.28 నుంచి 7.54 వరకు
సూర్యోదయం : 5.48
సూర్యాస్తమయం : 6.12
రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు
భవిష్యం
మేషం: పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
వృషభం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మిథునం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తిలాభం. అనుకోని ఆహ్వానాలు. పదవులు,హోదాలు దక్కవచ్చు. వ్యాపారాలు,ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కర్కాటకం: శ్రమాధిక్యం. పనులలో తొందర పాటు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
సింహం: కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. నిర్ణయాలలో మార్పులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు,ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
కన్య: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. ఆస్తిలాభం. పనుల్లో పురోగతి. ఇంటర్వ్యూలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.
తుల: వ్యవహారాలలో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు. భూములు, వాహనాలు కొంటారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
వృశ్చికం: మిత్రులతో విభేదాలు.ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి.అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
ధనుస్సు: బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. ఆరోగ్య సమస్యలు. పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. వ్యాపారాలు,ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
మకరం: కొత ్తపనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తు, వస్త్రలాభాలు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
కుంభం: పనుల్లో ఆటంకాలు. బంధువర్గంతో అకారణంగా వివాదాలు. ఆరోగ్య సమస్యలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో చిక్కులు.
మీనం: శుభకార్యాలకు హాజరవుతారు.సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. వ్యాపారాలు,ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
- సింహంభట్ల సుబ్బారావు