గ్రహం అనుగ్రహం (07-05-2016)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి శు.తదియ రా.3.44 వరకు, నక్షత్రం ఆరుద్ర ప.11.33 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం రా.11.20 నుంచి 12.55 వరకు
దుర్ముహూర్తం ఉ.8.04 నుంచి 8.55 వరకు
తదుపరి రా.10.51 నుంచి 11.35 వరకు
అమృతఘడియలు..లేవు
సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం: 6.28
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
భవిష్యం
మేషం: పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార,ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృషభం: బంధువులతో తగాదాలు వచ్చే అవకాశం ఉంది. అనారోగ్యం. దూర ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి.
మిథునం: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. వాహన యోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కర్కాటకం: మిత్రులతో స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.
సింహం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఇంటా బయటా ప్రోత్సాహం అందుతుంది. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
కన్య: బంధువులతో సఖ్యతగా మెలగుతారు. వస్తు లాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
తుల: రుణ ఒత్తిడులు కలుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం నెలకొంటుంది.
వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటా బయటా చికాకులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. పనులు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం ఎదురవుతుంది.
ధనుస్సు: పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మకరం: బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. పాతమిత్రుల కలయిక. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సొమ్ము సకాలంలో అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం అందుతుంది.
కుంభం: కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
మీనం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ధనవ్యయం. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.
- సింహంభట్ల సుబ్బారావు