గ్రహం అనుగ్రహం ( 28-07-2016)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం, తిథి బ.నవమి ప.1.04 వరకు
తదుపరి దశమి, నక్షత్రం భరణి ఉ.9.05 వరకు
తదుపరి కృత్తిక, వర్జ్యం రా.8.17 నుంచి 9.46 వరకు
దుర్ముహూర్తం ఉ.9.57 నుంచి 10.49 వరకు
తదుపరి ప.3.05 నుంచి 3.56 వరకు
అమృతఘడియలు ఉ.4.36 నుంచి 5.56 వరకు
సూర్యోదయం: 5.41
సూర్యాస్తమయం: 6.37
రాహుకాలం : ప 1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు
భవిష్యం
మేషం: పనులు చకచకా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యాపార,ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
వృషభం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.ఉద్యోగులకు ఒత్తిడులు.
మిథునం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కర్కాటకం: ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
సింహం: వ్యయప్రయాసలు. కొన్ని కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కన్య: పనుల్లో జాప్యం. బంధువర్గంతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు పనిభారం.
తుల: కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో ఆదరణ. పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
వృశ్చికం: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనుకున్న పనులు ముందుకు సాగవు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.
కుంభం: నూతన పరిచయాలు. ఆర్థిక ప్రగతి. ఆస్తిలాభం. ప్రత్యర్థుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
మీనం: మిత్రులు, కుటుంబసభ్యులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
- సింహంభట్ల సుబ్బారావు