
గ్రహం అనుగ్రహం, డిసెంబర్ 12, 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం, తిథి శు.పాడ్యమి సా.4.05 వరకు
తదుపరి విదియ
నక్షత్రం మూల రా.2.34 వరకు
వర్జ్యం ఉ.10.01 నుంచి 11.41 వరకు
తిరిగి రా.12.56 నుంచి 2.36 వరకు
దుర్ముహూర్తం ఉ.6.22 నుంచి 7.56 వరకు
అమృతఘడియలు రా.7.56 నుంచి 9.36 వరకు
సూర్యోదయం : 6.23
సూర్యాస్తమయం : 5.22
రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు
భవిష్యం
మేషం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. దుబారా ఖర్చులు. బంధువులతో విభేదాలు. ఆరోగ్య భంగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
వృషభం: కుటుంబసభ్యులతో మాట పట్టింపులు వస్తాయి. వ్యయ ప్రయాసలు. ఆదాయానికి మించి
ఖర్చులు. కొత్త బాధ్యతలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మిథునం: ఆకస్మిక ధన లాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. దైవ దర్శనాలు. వాహన యోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన ఉత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వస్తు లాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.
సింహం: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు చేస్తారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
కన్య: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృశ్చికం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సభ్యులతో తగాదాలు రావచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
ధనుస్సు: పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆస్తి లాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
మకరం: కుటుంబసభ్యులతో వివాదాలు రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. దైవ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కుంభం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధువులను కలుసుకుంటారు. భూ లాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
మీనం: నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.
- సింహంభట్ల సుబ్బారావు