
గ్రహం అనుగ్రహం, డిసెంబర్ 13, 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిరమాసం, తిథి శు.విదియ ప.3.57 వరకు
తదుపరి తదియ
నక్షత్రం పూర్వాషాఢ రా.2.51 వరకు
వర్జ్యం ప.12.16 నుంచి 1.53 వరకు
దుర్ముహూర్తం సా.4.03 నుంచి 4.54 వరకు
అమృతఘడియలు రా.10.01 నుంచి 11.41 వరకు
భవిష్యం
మేషం: దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్య భంగం. సోదరులతో కలహాలు. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
వృషభం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. అనారోగ్యం. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
మిథునం: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. భూ, గృహ యోగాలు. కీలక నిర్ణయాలు. ఉద్యోగ లాభం. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
కర్కాటకం: కుటుంబ సమస్యలు తీరతాయి. వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక అభివృద్ధి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
సింహం: ఆదాయం అంతగా కనిపించదు. వ్యయ ప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. దూర ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు.
కన్య: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సోదరులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పుణ్యక్షేత్రాల సందర్శన. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
తుల: ఇంటా బయటా మీదే పైచేయిగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆహ్వానాలందుతాయి. భూలాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
వృశ్చికం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు వస్తాయి. శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
ధనుస్సు: కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కుతాయి.
మకరం: కుటుంబంలో సమస్యలు రావచ్చు. అనారోగ్యం పాలవుతారు. బంధువులు, మిత్రులతో విభేదాలు వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం నెలకొంటుంది.
కుంభం: పనులు సజావుగా సాగుతాయి. ఆర్థికాభివృద్ధి. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
మీనం: ఇంటర్వ్యూలు అందుతాయి. కార్య జయం కలుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
- సింహంభట్ల సుబ్బారావు