
గ్రహం అనుగ్రహం, డిసెంబర్ 2, 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి బ.సప్తమి రా.1.43 వరకు
నక్షత్రం ఆశ్లేష ఉ.6.44 వరకు
తదుపరి మఖ
వర్జ్యం రా.7.36 నుంచి 9.20 వరకు
దుర్ముహూర్తం ప.11.34 నుంచి 12.24 వరకు
అమృతఘడియలు ఉ.4.45 నుంచి 6.27 వరకు
భవిష్యం
మేషం: పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. బంధువులతో తగాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
వృషభం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం.
మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. భూ లాభాలు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
కర్కాటకం: శ్రమ తప్పదు. పనులలో ఆటంకాలు కలుగుతాయి. వృథా ఖర్చులు చేస్తారు. ఆరోగ్య భంగం. దైవ దర్శనాలు. దూర ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాల్లో ఒత్తిడులు.
సింహం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. విందు వినోదాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. పదవీయోగం కలుగుతుంది.
కన్య: వ్యయ ప్రయాసలు. బంధువులతో తగాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూర ప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
తుల: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృశ్చికం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో విజయం. సోదరుల నుంచి ధనలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
ధనుస్సు: రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.
మకరం: అనుకోని ప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. దుబారా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కుంభం: పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక ప్రగతి. నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆస్తిలాభం. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరం.
మీనం: ఆదాయం పెరుగుతుంది. వస్తు లాభాలు. ఉద్యోగయత్నాలు సానుకూలంగా ఉంటాయి. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
- సింహంభట్ల సుబ్బారావు