
గ్రహం అనుగ్రహం, డిసెంబర్ 5, 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి బ.దశమి పూర్తి
నక్షత్రం ఉత్తర ప.1.10 వరకు
తదుపరి హస్త
వర్జ్యం రా.10.28 నుంచి 12.15 వరకు
దుర్ముహూర్తం ఉ.6.20 నుంచి 7.55 వరకు
అమృతఘడియలు ఉ.5.14 నుంచి 6.54 వరకు
భవిష్యం
మేషం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో ఆదరణ. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విందు వినోదాలు. ఉద్యోగ యోగం. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
వృషభం: పనుల్లో ప్రతిష్ఠంభన. ఆరోగ్య భంగం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
మిథునం: చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు. దైవ దర్శనాలు. ధన వ్యయం. మిత్రులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యం.
కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
సింహం: కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా బయటా చికాకులు. ఆలయ దర్శనాలు. ధన వ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.
కన్య: కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సహాయం అందుతుంది. కార్య జయం కలుగుతుంది. ఆస్తి లాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత నెలకొంటుంది.
తుల: బంధువులతో తగాదాలు రావచ్చు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడులు ఎదురవుతాయి. అనుకోని ఖర్చులు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
వృశ్చికం: దూరపు బంధువుల కలయిక. విందు వినోదాలు. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు,ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
ధనుస్సు: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
మకరం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కుంభం: ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు నెలకొంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
మీనం: పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు. దూర ప్రయాణాలు చేస్తారు సోదరులు, సోదరీలతో కలహాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాల్లో సమస్యలెదురుకావచ్చు.
- సింహంభట్ల సుబ్బారావు