
గ్రహం అనుగ్రహం, డిసెంబర్ 6, 2015
శ్రీమన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం, తిథి బ.దశమి ఉ.7.20 వరకు
తదుపరి ఏకాదశి, నక్షత్రం హస్త ప.3.45 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం రా.12.32 నుంచి 2.19 వరకు
దుర్ముహూర్తం సా.3.58 నుంచి 4.48 వరకు
అమృతఘడియలు ఉ.9.05 నుంచి 10.51 వరకు
భవిష్యం
మేషం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి సాధిస్తారు.
వృషభం: ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అదనపు బాధ్యతలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
మిథునం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఉద్యోగ యత్నాలలో నిరుత్సాహం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.
కర్కాటకం: కార్యసిద్ధి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి లాభం. పలుకుబడి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి.
సింహం: సన్నిహితులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. కుటుంబ సమస్యలు. దూర ప్రయాణాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
కన్య: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందువినోదాలు. పాతబాకీలు వసూలవుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు.
తుల: దూర ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్య భంగం. సోదరులతో విభేదాలు. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
వృశ్చికం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. పనులు సజావుగా సాగుతాయి. వస్తు, వస్త్ర లాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
ధనుస్సు: ఇంటర్వ్యూలు అందుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
మకరం: రుణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు. పనుల్లో తొందరపాటు. బంధువులతో తగాదాలు. ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కుంభం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందు వినోదాలు. కార్య సిద్ధి కలుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి.
మీనం: పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక చింతన. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
- సింహంభట్ల సుబ్బారావు