
గ్రహం అనుగ్రహం, జనవరి 20, 2016
శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం, తిథి శు.ఏకాదశి ఉ.11.11 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం రోహిణి రా.9.21 వరకు, వర్జ్యం ప.1.45 నుంచి 3.17 వరకు, తదుపరి రా.2.48 నుంచి 4.22 వరకు, దుర్ముహూర్తం ప.11.49-12.40 వరకు, అమృతఘడియలు సా.6.20 నుంచి 7.53 వరకు
భవిష్యం
మేషం: చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
వృషభం: చిరకాల మిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
మిథునం: సన్నిహితులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
కర్కాటకం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
సింహం: ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. శ్రమ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక చింతన. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య: ఆర్థిక ఇబ్బందులు, రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
తుల: దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
ధనుస్సు: వ్యవహారాలలో పురోగతి. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక ప్రగతి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మకరం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. శ్రమ మరింతగా పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.
కుంభం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. మిత్రులతో విభేదాలు. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
మీనం: కుటుంబసౌఖ్యం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పరపతి పెరుగుతుంది. వాహనాలు కొంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
- సింహంభట్ల సుబ్బారావు