
గ్రహం అనుగ్రహం, జనవరి 3, 2016
శ్రీ మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి బ.నవమి రా.1.17 వరకు
నక్షత్రం చిత్త రా.1.40 వరకు
వర్జ్యం ఉ.7.51 నుంచి 9.39 వరకు
దుర్ముహూర్తం సా.4.09 నుంచి 5.01 వరకు
అమృతఘడియలు సా.7.31 నుంచి 8.19 వరకు
భవిష్యం
మేషం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. నూతన వ్యక్తుల పరిచయం. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
వృషభం: విద్య, ఉద్యోగావకాశాలు. సంఘంలో గౌరవం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వస్తు, వాహన లాభాలు. కార్యసిద్ధి. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
కర్కాటకం: పనుల్లో ఆటంకాలు. నిర్ణయాలలో మార్పులు చోటుచేసుకుంటాయి. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. దైవదర్శనాలు.
సింహం: కుటుంబసభ్యులతో సఖ్యత. ఇంటా బయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా ఉంటాయి.
కన్య: కుటుంబ సమస్యలు. ధనవ్యయం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
తుల: ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
వృశ్చికం: పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు. కుటుంబంలో ఒత్తిడులు. రుణ యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
ధనుస్సు: శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కార్య జయం కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
మకరం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
కుంభం: దూరపు బంధువుల కలయిక. విందు వినోదాలు. కార్యజయం కలుగుతుంది. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మీనం: మిత్రులతో వివాదాలు రావచ్చు. ఆర్థిక ఇబ్బందులుంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. రుణ యత్నాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
- సింహంభట్ల సుబ్బారావు