
గ్రహం అనుగ్రహం, జులై 9, 2016
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం, తిథి శు.పంచమి ప.2.40 వరకు
తదుపరి షష్ఠి ,నక్షత్రం పుబ్బ రా.9.33 వరకు
వర్జ్యం ఉ.4.33 నుంచి 6.15 వరకు
దుర్ముహూర్తం ఉ.5.34 నుంచి 7.21 వరకు
అమృతఘడియలు ప.2.44 నుంచి 4.24 వరకు
భవిష్యం
మేషం: పనులు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇంటా బయటా చికాకులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం నెలకొంటుంది.
వృషభం: బంధు వర్గంతో తగాదాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు. వ్యయ ప్రయాసలు. దూర ప్రయాణాలు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
మిథునం: శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కర్కాటకం: పనుల్లో జాప్యం జరగవచ్చు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ యత్నాలలో ఆటంకాలు. సోదరుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.
సింహం: వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా మెలగుతారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
కన్య: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. శ్రమాధిక్యం. మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
తుల: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయదర్శనాలు. వాహన , గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా ఉంటాయి.
వృశ్చికం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి.
ధనుస్సు: బంధువులతో మాటపట్టింపులు. వ్యవహారాలు ముందుకు సాగవు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మకరం: పనుల్లో తొందరపాటు కలగవచ్చు. దూరప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం. మిత్రులతో విభేదాలు రావచ్చు. అనుకోని ఖర్చులు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.
కుంభం: దూరపు బంధువులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. విందువినోదాలు. యత్న కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
మీనం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి లాభం కలగవచ్చు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
- సింహంభట్ల సుబ్బారావు