
గ్రహం అనుగ్రహం, మార్చి 16, 2016
శ్రీ మన్మథనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణమాసం, తిథి శు.అష్టమి ప.2.58 వరకు
తదుపరి నవమి, నక్షత్రం మృగశిర ప.12.33 వరకు, తదుపరి ఆరుద్ర
వర్జ్యం రా.8.44 నుంచి 10.15 వరకు
దుర్ముహూర్తం ప.11.44 నుంచి 12.33 వరకు
అమృతఘడియలు రా.2.11 నుంచి 3.44 వరకు
భవిష్యం
మేషం: పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విందు వినోదాలు. ఆర్థిక ప్రగతి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కుతుంది.
వృషభం: కొన్ని కార్యక్రమాలు మందగిస్తాయి. అనుకోని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. రుణాలు చేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు నెలకొంటాయి.
మిథునం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. వాహనయోగం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు పదోన్నతులు.
కర్కాటకం: శ్రమాధిక్యం. అనారోగ్యం. పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. వ్యయ ప్రయాసలు. దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
సింహం: యత్న కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.
కన్య: అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
తుల: రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో కలహాలు. అనారోగ్యం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
వృశ్చికం: దుబారా వ్యయం. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. పనుల్లో అవాంతరాలు. దూర ప్రయాణాలు. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం.
ధనుస్సు: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో నూతనోత్సాహం నెలకొంటుంది.
మకరం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజకనంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
కుంభం: వ్యయప్రయాసలు. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
మీనం: దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది. పనుల్లో అవాంతరాలు. వృథా ఖర్చులు. బంధు విరోధాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
- సింహంభట్ల సుబ్బారావు