
గ్రహం అనుగ్రహం, మార్చి 17, 2016
శ్రీ మన్మథనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణమాసం, తిథి శు.నవమి ప.1.44 వరకు
తదుపరి దశమి, నక్షత్రం ఆరుద్ర ప.12.01 వరకు
తదుపరి పునర్వసు, వర్జ్యం రా.11.55 నుంచి 1.30 వరకు,
దుర్ముహూర్తం ఉ.10.07 నుంచి 10.56 వరకు,
తదుపరి ప.2.54 నుంచి 3.44 వరకు అమృతఘడియలు ..లేవు
భవిష్యం
మేషం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. విద్యావకాశాలు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
వృషభం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే.
మిథునం: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహా రాలలో విజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు విస్తరణ. ఉద్యోగులకు కొత్త హోదాలు.
కర్కాటకం: మిత్రులతో కలహాలు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇంటా బయటా నిరుత్సాహం. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
సింహం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందు వినోదాలు. కార్యజయం. వాహన యోగం కలుగుతుంది. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
కన్య: నూతన ఉద్యోగ యోగం. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.
తుల: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలు. బంధుమిత్రులతో విభేదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
వృశ్చికం: బంధువుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
ధనుస్సు: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరపతి పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
మకరం: వివాహ, ఉద్యోగయత్నాలు సఫలం అవుతాయి. విందు వినోదాలు. గృహ యోగం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కుంభం: ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. దైవదర్శనాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు గందరగోళం.
మీనం: మిత్రులతో తగాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలో లాభాలు స్వల్పమే. ఉద్యోగులకు ఒత్తిడులు.
- సింహంభట్ల సుబ్బారావు