
గ్రహం అనుగ్రహం, మార్చి 19, 2016
శ్రీ మన్మథనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణమాసం, తిథి శు. ఏకాదశి ప.12.41 వరకు
తదుపరి ద్వాదశి, నక్షత్రం పుష్యమి ప.12.04 వరకు
తదుపరి ఆశ్లేష వర్జ్యం రా.1.16 నుంచి 2.55 వరకు
దుర్ముహూర్తం ఉ.6.10 నుంచి 7.45 వరకు
అమృతఘడియలు ఉ.5.58 నుంచి 7.17 వరకు
భవిష్యం
మేషం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. వ్యయ ప్రయాసలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం నెలకొంటుంది.
వృషభం: కొత్త పనులు ప్రారంభం చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
మిథునం: కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
కర్కాటకం: కొత్త విషయాలు తెలుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం. వస్తు లాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి.
సింహం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటా బయటా సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కన్య: ఉద్యోగ యత్నాలు సానుకూలం. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
తుల: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో ఒత్తిడులు. ఉద్యోగులకు పనిభారం.
మకరం: కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. వసు ్తలాభాలు. విందు వినోదాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం నెలకొంటుంది.
కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
మీనం: కుటుంబంలో చికాకులు. అనుకోని ఖర్చులు చేసే అవకాశం ఉంది. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. పుణ్యక్షేత్రాల సందర్శన. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
- సింహంభట్ల సుబ్బారావు