గ్రహం అనుగ్రహం, మార్చి 23, 2016 | graham anugraham, march 23, 2016 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, మార్చి 23, 2016

Published Wed, Mar 23 2016 2:15 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం, మార్చి 23, 2016 - Sakshi

గ్రహం అనుగ్రహం, మార్చి 23, 2016

శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణమాసం, తిథి పౌర్ణమి సా.4.16 వరకు,
తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం ఉత్తర రా.6.05 వరకు
తదుపరి హస్త, వర్జ్యం తె.3.20-5.07 వరకు (తెల్లవారితే గురువారం)
దుర్ముహూర్తం ప.11.41-12.31 వరకు
అమృతఘడియలు ప..2.01 నుంచి 3.34 వరకు

భవిష్యం
 
మేషం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. వసు ్తలాభాలు. ఉద్యోగ యోగం ప్రాప్తిస్తుంది. వ్యాపార వృద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరిగే అవకాశం ఉంది.
 
వృషభం
: ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో నిరుత్సాహం ఎదురవుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు నెలకొంటాయి.
 
మిథునం: పనులు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు కలుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
 
సింహం: కుటుంబంలో చికాకులు పెరిగే అవకాశం ఉంది. ఆలయాలను సందర్శిస్తారు. పనుల్లో అవరోధాలు కలుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం నెలకొంటుంది.
 
కన్య: కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.
 
తుల: వ్యయప్రయాసలు. దుబారా ఖర్చులు చేసే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
 
వృశ్చికం: కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఆకస్మిక ధన లాభం. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
 
ధనుస్సు: వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
 
మకరం: ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
 
కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఎంతగా కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు ఒత్తిడులు.
 
మీనం
: కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
 
- సింహంభట్ల సుబ్బారావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement