
గ్రహం అనుగ్రహం, మార్చి 24, 2016
శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణమాసం
తిథి బ.పాడ్యమి రా.6.11 వరకు,
నక్షత్రం హస్త రా.8.31 వరకు,
వర్జ్యం ..లేదు,
దుర్ముహూర్తం ఉ.10.04 నుంచి 10.55 వరకు,
తదుపరి ప.2.55 నుంచి 3.44 వరకు అమృతఘడియలు ప.1.54 నుంచి 3.40 వరకు
భవిష్యం
మేషం: పనులు చకచకా సాగుతాయి. ఆర్థికాభివృద్ధి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిభావంతులుగా గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృషభం: మిత్రులతో కలహాలు వచ్చే అవకాశం ఉంది. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. బంధువుల కలయిక. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు నెలకొంటాయి.
మిథునం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. దూర ప్రయాణాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం.
కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.
సింహం: పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కన్య: దూరపు బంధువుల కలయిక. విందు వినోదాలు. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.
తుల: కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా బయటా సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. మిత్రులతో మాటపట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ధన వ్యయం. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం నెలకొంటుంది.
ధనుస్సు: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మకరం: వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
కుంభం: చేపపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూర ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.
మీనం: మిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనాలు. అనారోగ్యం. పనులు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.
- సింహంభట్ల సుబ్బారావు