
గ్రహం అనుగ్రహం, మార్చి 27, 2016
శ్రీ మన్మథనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి బ.చవితి రా.12.12 వరకు
నక్ష త్రం విశాఖ తె.4.05 వరకు(తెల్లవారితే సోమవారం)
వర్జ్యం ఉ.7.44 నుంచి 9.31 వరకు
దుర్ముహూర్తం సా.4.30నుంచి 5.20 వరకు
అమృతఘడియలు సా.6.20 నుంచి 8.03 వరకు
భవిష్యం
మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభకు గుర్తింపు పొందుతారు. వస్తు,వస్త్ర లాభాలు. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృషభం: పనులు సకాలంలో పూర్తి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మిథునం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూర ప్రయాణాలు. ఇంటా బయటా చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
కర్కాటకం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
సింహం: మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో కొత్త ఆశలు.
కన్య: బంధువులతో తగాదాలు. ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
తుల: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత ్తహోదాలు.
వృశ్చికం: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
ధనుస్సు: నూతన పరిచయాలు. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
మకరం: చిన్ననాటి మిత్రుల కలయిక. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.
కుంభం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా సమస్యలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మీనం: వ్యవహారాలు ముందుకు సాగవు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.
- సింహంభట్ల సుబ్బారావు