
గ్రహం అనుగ్రహం, మే 10, 2016
శ్రీదుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం,
తిథి శు.చవితి సా.5.10 వరకు,
తదుపరి పంచమి
నక్షత్రం ఆరుద్ర రా.3.33 వరకు, వర్జ్యం ప.12.19 నుంచి 1.54 వరకు
దుర్ముహూర్తం ఉ.8.04 నుంచి 8.55 వరకు, తదుపరి రా.10.46 నుంచి 11.36 వరకు,
అమృతఘడియలు సా.5.46 నుంచి 7.19 వరకు
భవిష్యం
మేషం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం నెలకొంటుంది.
వృషభం: చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు కలుగుతాయి. దుబారా వ్యయం. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.
మిథునం: శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. విద్యార్థులకు ముఖ్య సమాచారం. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వృత్తి,వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
కర్కాటకం: శ్రమ పెరుగుతుంది. అనారోగ్యం. పనుల్లో తొందరపాటు. ఆస్తి వివాదాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
సింహం: పరిచయాలు పెరుగుతాయి. భూవివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
కన్య: నూతన ఉద్యోగలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. కార్యసిద్ధి. దూరపు బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
తుల: మిత్రులతో మాటపట్టింపులు వస్తాయి. ధన వ్యయం. కుటుంబ,ఆరోగ్య సమస్యలు. దూర ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృశ్చికం: ఆకస్మికప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. నిర్ణయాలలో మార్పులు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
ధనుస్సు: పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందు వినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో పురోగతి.
మకరం: మిత్రులతో సఖ్యతగా ఉంటారు. విందు వినోదాలు. అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కుంభం: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఇంటా బయటా బాధ్యతలు. అనుకోని ప్రయాణాలు. దైవ దర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.
మీనం: శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా పడతాయి. శ్రమ తప్ప ఫలితం ఉండదు. కుటుంబంలో చికాకులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
- సింహంభట్ల సుబ్బారావు