
గ్రహం అనుగ్రహం, మే 11, 2016
శ్రీదుర్ముఖినామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం, తిథి శు.పంచమి
ప.3.44 వరకు, తదుపరి షష్ఠి
నక్షత్రం పునర్వసు రా.2.57 వరకు
వర్జ్యం ప.3.14 నుంచి 4.48 వరకు
దుర్ముహూర్తం ప.11.29 నుంచి 12.20 వరకు
అమృతఘడియలు రా.12.36 నుంచి 2.10 వరకు
మేషం: ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
వృషభం: పనులలో అవాంతరాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
మిథునం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
కర్కాటకం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువిరోధాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
సింహం: కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు.
కన్య: వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
తుల: రుణయత్నాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. దైవదర్శనాలు. వ్యాపారాలు,ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. పనులు ముందుకు సాగవు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
ధనుస్సు: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
మకరం: పరిచయాలు పెరుగుతాయి. భూవివాదాల పరిష్కారం. శుభకార్యాలరీత్యా ఖర్చులు. అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటాయి.
కుంభం: పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో వైరం. అనారోగ్యం. కుటుంబసమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మీనం: కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో ఇబ్బందులు.- సింహంభట్ల సుబ్బారావు