
గ్రహం అనుగ్రహం, మే 14, 2016
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం, తిథి శు.అష్టమి ప.2.45 వరకు
తదుపరి నవమి, నక్షత్రం మఖ తె.4.55 వరకు(తెల్లవారితే ఆదివారం)
వర్జ్యం సా.4.20 నుంచి 5.58 వరకు
దుర్ముహూర్తం ఉ.5.32 నుంచి 7.15 వరకు
అమృతఘడియలు రా.2.20 నుంచి 3.44 వరకు
మేషం: దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. ముఖ్యమైన పనులు వాయిదా. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.
వృషభం: బంధువులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యపరమైన చికాకులు. ధనవ్యయం. వ్యాపార,ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకోని పదోన్నతులు.
కర్కాటకం: శ్రమాధిక్యం. ముఖ్యమైన పనులు వాయిదా. సోదరులు,సోదరీలతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.
సింహం: చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.
కన్య: వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
తుల: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.
వృశ్చికం: ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
ధనుస్సు: దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
మకరం: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో విభేదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
కుంభం: పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. కార్యజయం. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మీనం: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. భూలాభాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. - సింహంభట్ల సుబ్బారావు