
గ్రహం అనుగ్రహం, మే 17, 2016
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం,
తిథి శు.ఏకాదశి సా.5.51 వరకు,
తదుపరి ద్వాదశి
నక్షత్రం ఉత్తర ఉ.8.23 వరకు,
తదుపరి హస్త,
వర్జ్యం సా.5.35 నుంచి 7.20 వరకు,
దుర్ముహూర్తం ఉ.8.05 నుంచి 8.55 వరకు,
తదుపరి రా.10.48 నుంచి 11.36 వరకు,
అమృతఘడియలు ..లేవు
భవిష్యం
మేషం: పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వస్తులాభాలు. దైవ దర్శనాలు చేసుకుంటారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృషభం: పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు పనిఒత్తిడులు.
మిథునం: ఆర్థిక ఇబ్బందులు. దూర ప్రయాణాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
కర్కాటకం: పనులలో పురోగతి. ఇంటా బయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు.
సింహం: కుటుంబసభ్యులతో తగాదాలు. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. వృథా ఖర్చులు. వ్యయప్రయాసలు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.
కన్య: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. ఆస్తి ఒప్పందాలు. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
తుల: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సభ్యులతో వైరం. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.
వృశ్చికం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి నెలకొంటుంది.
ధనుస్సు: బంధువులతో సఖ్యత. నూతన ఉద్యోగ ప్రాప్తి. సంఘంలో ఆదరణ పొందుతారు. వస్తు లాభాలు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మకరం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయ ప్రయాసలు. ధనవ్యయం. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపార,ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
కుంభం: బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకోని ఖర్చులు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు చోటుచేసుకుంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం.
మీనం: కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ యత్నాలు సానుకూలంగా ఉంటాయి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.
- సింహంభట్ల సుబ్బారావు